HomeNewsAndhra Pradeshచంద్రబాబుకి దక్కని ఊరట

చంద్రబాబుకి దక్కని ఊరట

Published on

అక్టోబర్ 09, 2023 చంద్రబాబుకి కలిసి రాలేదు. ఇవాళ చంద్రబాబుకి ఎక్కడా ఊరట లభించలేదు. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై ఏసీబీ కోర్టులో తీర్పు ఇచ్చింది. చంద్రబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్ట్ కొట్టివేసింది. సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కూాడా తోసిపుచ్చింది. కాగా ఈ రోజు ఉదయం ఏపీ హైకోర్టులో కూడా చంద్రబాబుకు నిరాశే ఎదురైంది. అంగళ్లు అల్లర్లు, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్ట్ కొట్టివేసిన విషయం తెలిసిందే.చంద్రబాబు ఎస్‌ఎల్‌పీపై (SLP) సుప్రీంకోర్ట్‌లో వాదనలు కొనసాగుతున్నాయి. గత రెండు గంటలుగా హరిష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై రేపు కూడా విచారణ కొనసాగనుంది. మరి రేపు కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడతాయోనని టీడీపీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Latest articles

More like this