HomeNewsLatest Newsతెలంగాణలో ఎన్నికల నగారా... నవంబర్ 30న పోలింగ్..

తెలంగాణలో ఎన్నికల నగారా… నవంబర్ 30న పోలింగ్..

Published on

యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు.తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు.. ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ నవంబర్ 3న రానుందని వెల్లడించారు. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10, 2023 అని వెల్లడించారు. పరిశీలన 13 నవంబర్, 2023 అని వివరించారు. ఇక ఉపసంహరణ చివరి తేదీ 15 నవంబర్, 2023 (బుధవారం) అని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ 3 డిసెంబర్, 2023న (ఆదివారం) జరుగుతుంది. దేశంలో ఐదురాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 5 నాటికి పూర్తవుతుంది.

2018లో డిసెంబర్ 7న ఎన్నికల పోలింగ్ జరిగితే. ఫలితాలు 11 డిసెంబర్ 2018న వెలువడ్డాయి. తెలంగాణలో 2018లో నామినేషన్ల తేదీ 12 నవంబర్ 2018 సోమవారం కాగా, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 19 నవంబర్ 2018 సోమవారంగా ఉంది. నామినేషన్ల పరిశీలన తేదీ20 నవంబర్ 2018మంగళవారంగా ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ       22 నవంబర్ 2018గా ఉంది.పోలింగ్ ఒకే విడతలో అప్పుడు డిసెంబర్ 7, 2018 శుక్రవారం జరిగింది.11 డిసెంబర్ 2018మంగళవారం ఓట్లను లెక్కించారు. 13 డిసెంబర్ 2018 గురువారం ఎన్నికల ప్రక్రియ ముగిసింది.

మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17న ముగియనుంది.

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ గడువు ముగింపు తేదీ – జనవరి 3న

మధ్యప్రదేశ్ అసెంబ్లీ గడువు ముగింపు తేదీ – జనవరి 8న

రాజస్థాన్ అసెంబ్లీ గడువు ముగింపు తేదీ- జనవరి 14న

తెలంగా అసెంబ్లీ గడువు ముగింపు తేదీ – జనవరి 18న.

5 రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు

మధ్యప్రదేశ్ – 230 సీట్లు

ఛత్తీస్‌గఢ్ – 90 సీట్లు

రాజస్థాన్ – 200 సీట్లు

తెలంగాణ – 119 సీట్లు

మిజోరం – 90 సీట్లు.

మరోవైపు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడంతో ప్రభుత్వ పరంగా అధికార పార్టీ ఏ పనులు చేయడానికి వీల్లేదు. ఎన్నిక కోడ్ అమలులోకి వచ్చిన నేపధ్యంలో నిబంధనలను అధికారులు, వివిధ పార్టీల నేతలు, అభ్యర్థులు, పాటించాల్సి ఉంటుంది. అధికార పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ పనులకు పాలన యంత్రాగాన్ని వినియోగించుకోకూడదు..అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండూ కలిపి ఉండకూడదు. ముఖ్యమంత్రితో సహా ఎవరైనా సరే హెలికాప్టర్‌తోపాటు ఇతర ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. ఇంటి నుంచి కార్యాలయానికి, కార్యాలయం నుంచి ఇంటికి తప్ప మరే ఇతర పనులకు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు.సెక్యూరిటీ వాహనాల్లోనూ మూడు కంటే ఎక్కువ వాడితే దాన్ని ఎన్నికల వ్యయం కింద సంబంధిత పార్టీ చూపించాలి.ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుంది.

Latest articles

More like this