HomeNewsLatest Newsతెలంగాణలో లేటెస్ట్ సర్వే.. అధికారం ఎవరిదంటే?

తెలంగాణలో లేటెస్ట్ సర్వే.. అధికారం ఎవరిదంటే?

Published on

తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అధికారం నిలుపుకునేందుకు బీఆర్ఎస్, అధికారం సాధించేందుకు కాంగ్రెస్ ఆరాట పడుతున్నాయి. గత పదేళ్ళలో వివిధ అభివృద్ధి పథకాలు చేస్తూ రాష్ట్రం ని అభివృధి వైపు నడిపిస్తుంది, వివిధ రకాల పథకాలు దేశంలో లేని విధంగా రూప కల్పన చేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుంది, అందులో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, శాధి ముబారక్, రైతు బంధు, రైతు బీమా, కంటి వెలుగు, వృద్యాప్య పెన్షన వంటి బహులమైన పథకాలతో దూసుకుపోతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు బలంగా ఉండటంలో పెద్ద మార్పులు చేయకపోయినా, ప్రజల్లో మాత్రం బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత అక్కడక్కడా కనిపిస్తోంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిననాటినుంచి ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న పార్టీ కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒక్క ఛాన్స్ కావాలంటోంది. ప్రజలు కాంగ్రెస్ పాలన కావాలనుకుంటున్నారని, అందుకే జనం మెచ్చే మేనిఫెస్టో రాబోతోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తాజాగా లోక్ పోల్ అనే సంస్థ తెలంగాణలో ప్రీ పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కీలక అంశాలు తెరమీదకు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో అధికారం ఎవరికి దక్కుతుంది, పోటీ ఎలా ఉండబోతోందనేది ఈ సర్వేలో తేలిందని లోక్ పోల్ సంస్థ తెలిపింది. గతంలో లోక్ పోల్ సంస్థ కర్నాటకలోనూ ఇలాంటి సర్వే నిర్వహించింది. అప్పుడు కూడా ఈ సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయని అనేకమంది పేర్కొన్నారు.

ఈ సర్వే ప్రకారం అధికార బీఆర్ఎస్ పార్టీకి 45-51 సీట్లు దక్కుతాయి
భారతీయ జాతీయ కాంగ్రెస్ కి 61-67 సీట్లు దక్కుతాయి
మజ్లిస్ పార్టీకి 6 -8 సీట్లు
బీజేపీకి 2-3 సీట్లు

ఇతరులు 0-1 సీటు దక్కించుకుంటాయని లోక్ పోల్ సర్వే వెల్లడించింది.

ఇక తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల షేరింగ్ సంగతికి వస్తే బీఆర్ఎస్ పార్టీకి 39 నుంచి 42 శాతం, కాంగ్రెస్ పార్టీకి 41 నుంచి 44 శాతం ఓట్ల శాతం షేరింగ్ లభించనుంది. ఇక మజ్లిస్ పార్టీ ఓట్ల షేరింగ్ 3 నుంచి 4 శాతం మాత్రమే ఉండనుంది. బీజేపీ ఓట్ల శాతం 10 శాతం నుంచి12 శాతం, ఇతరులు 3 శాతం నుంచి 5 శాతం ఉంటుందని తెలిపింది. 30 బూత్ ల ను జియోగ్రాఫికల్ గా ర్యాండమ్ పద్ధతిలో సెలక్ట్ చేశారు.

తెలంగాణ ప్రీ పోల్ సర్వే ప్రకారం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 30 వరకూ సుమారు 60 వేలు శాంపిల్స్ తీసుకున్నారు. వీటి ద్వారా ఫలితాలను విశ్లేషించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఖచ్చితమయిన పద్దతిలో సర్వే నిర్వహించాం అని సంస్థ తెలిపింది. అంతేకాదు ఓటర్ల నుంచి ఫోన్ కాల్స్ నుంచి సర్వే ఫలితాలను క్రోడికరించారు. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ జరుగుతాయి.బీఆర్ఎస్ కంటే మార్జినల్ ఓట్ షేర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది. ప్రభుత్వ వ్యతిరేకత ఇటు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్రంగా ఉందని సర్వే వెల్లడించింది. వీరితో పాటు కేసీఆర్ విధానాల పట్ల కూడా ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోందని సర్వేలో తేలింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కూడా ప్రభుత్వంపై వ్యతిరేతను పెంచింది అంటున్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, వివిధ వర్గాలు ప్రభుత్వంపై అసహనంతో ఉన్నారు. గత నెల 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సభలో ప్రకటించిన హామీలు కూడా ఆపార్టీ ఓట్ షేరింగ్ పెంచుతున్నాయని తేలింది. పాతబస్తీలో మజ్లిస్ మాత్రం గట్టి పోటిని ఎదుర్కొన్నా.. పాత స్థానాలను నిలబెట్టుకోబోతోంది. ఇక రేసులో తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీకి మాత్రం ఈ సర్వే షాకిచ్చిందనే చెప్పాలి. మొత్తం మీద ఈ సర్వే ఫలితాలు తాజాగా బయటపడడంతో కాంగ్రెస్ వర్గాలు ఖుషీగా ఉన్నాయి.

Latest articles

More like this