రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ది ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ (ఐఐ ఓటి) ఇన్ 5జి ఎన్విరాన్మెంట్” అనే అంశంపై గురు నానక్ విద్య సంస్థలో జాతీయస్థాయి సెమినార్ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ విద్యాసంస్థలలో డిపార్ట్మెంట్ అఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వారి ఆధ్వర్యంలో ది సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు (ఎస్ ఇ ఆర్ బి), డిపార్ట్మెంట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డి ఎస్ టి) సహకారంతో ఐదు రోజులపాటు “రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ది ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ (ఐ ఐ ఓ టి) ఇన్ 5జి ఎన్విరాన్మెంట్” అనే సామజిక దృక్పథంతో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించడం జరిగింది. విద్యాసంస్థల విద్యార్తులతో పాటుగా దేశం నలుమూలల నుండి దాదాపు 60 మంది విద్యార్థులు సెమినార్ కోసం నమోదు చేసుకుని పాల్గొన్నారు. వారు తమ అమూల్యమైన పరిశోధన అంశాలను ఈ సెమినార్ లో చర్చించి సమర్పించడం జరిగింది . ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ ఐ ఓ టి) పారిశ్రామిక అనువర్తనాలు మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ ఓ టి) యొక్క అభివృద్ధి మరియు విస్తరణను సూచిస్తుంది. వ్యాపారాలు మరియు పరిశ్రమలు మరింత సమర్థవంతంగా మరియు విశ్వసనీయంగా పనిచేయడానికి ఐ.ఐ.ఓ.టి ఎంతగానో సహాయపడుతుంది. 5జి రిమోట్ సెన్సార్ కనెక్టివిటీ, ఐఓటి డేటా మరియు తక్కువ-లేటెన్సీ డేటా రవాణాతో ఇంటలిజెన్స్ నెట్వర్క్ మరియు అప్లికేషన్ సేవల వేగాన్ని పెంచి సేవలను అందించే విదంగా ఉపయోగపడుతుంది. ఇందులో 5జి ప్రమాణాలలో బిగ్ డేటా అనలిటిక్స్ ఫర్ నెట్వర్క్ మరియు బిజినెస్ ఇంటలిజెన్స్ ఉంటాయి. రోబోటిక్స్, మెడికల్ టెక్నాలజీ మరియు సాఫ్ట్వేర్-డిఫైన్డ్ ప్రొడక్షన్ ప్రాసెస్ల వంటి పారిశ్రామిక అప్లికేషన్లు అన్నీ ఐ.ఐ.ఓ.టి లో చేర్చబడ్డాయి అని అందరు సేవలను వినియోగించుకోవచ్చని ఈ సందర్బంగా పాల్గొన్న ప్రతినిధులు తెలియ చేసారు.
ఈ సెమినార్ ప్రారంభ కార్యక్రమానికి హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ నిర్మల్ దేవి మరియు న్యూ ఢిల్లీలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్ రీసెర్చ్ డీన్ డాక్టర్ పవన్ విగ్ విచ్చేసి ప్రతినిధులతో తమ అనుభవాలను పంచుకుని వారికి భవిష్యత్తులో ముందుకు సాగె విధంగా దిశానిర్దేశం చేసారు. ఈ సెమినార్ ను విజయవంతంగ నిర్వహించిన సభ్యులను గురు నానక్ విద్యా సంస్థల వైస్ చైర్మన్, సర్దార్ గగన్ దీప్ సింగ్ కోహ్లీ అభినందించారు. గురు నానక్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ ఎస్ సైని మాట్లాడుతూ ఎస్.ఇ.ఆర్.బి, డిపార్ట్మెంట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో ఇటువంటి సెమినార్ ను నిర్వహించినందుకు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, జి.ఎన్.ఐ.టి.సి వారిని అభినందించారు.
విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ కొడుగంటి వెంకటరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనాథరెడ్డి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పి. పార్థసారధీ, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ రిషి సయాల్, డీన్ ఆర్ & డి డాక్టర్ ఎస్ వి రంగనాయకులు, హెచ్ ఓ డి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి, సెమినార్ కు కన్వీనర్ గా డాక్టర్ రషీద్ మహమూద్ మరియు సహా కన్వీనర్ గా డాక్టర్ సందీప్ పాటిల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఐక్యూఏసి మరియు సిబ్బంది పాల్గొన్నారు.