Sonia Gandhi Book Revelations

రాహుల్‌ని అడ్డుకోలేదు
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన జీవిత ప్రయాణాన్ని వివరిస్తూ రాసిన ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకం రిలీజ్ అయింది. ఈ పుస్తకంలో అనేక ఆసక్తికర విషయాలను సోనియా గాంధీ పంచుకున్నారు. తన భర్త రాజీవ్‌ గాంధీ రాజకీయాల్లోకి రావడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించానని, వెళ్లవద్దని వేడుకున్నానని సోనియా గాంధీ చెప్పారు. రాజీవ్‌ రాజకీయాల్లోకి వెళ్లవద్దని దశాబ్దాల క్రితమే తాను వేడుకున్నానని, ఆ నిర్ణయం వల్ల కుటుంబం కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లాల్సి వస్తుందని ఆందోళన చెందానని పుస్తకంలో రాశారు. తండ్రి రాజకీయాల్లో కొనసాగడంపై రాహుల్‌ విభేదించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. అయినప్పటికీ రాజీవ్‌ విలువలు, ధైర్యం పట్ల ఆయనకు ఎంతో గౌరవం ఉండేదని సోనియా(Sonia Gandhi Book Revelations) పేర్కొన్నారు. అయితే కుమారుడు రాహుల్‌ గాంధీ రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు మాత్రం తాను అడ్డుకోలేదని తెలిపారు. రాహుల్‌కు చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉండేదని సోనియా గుర్తుచేసుకున్నారు. ముప్పు ఉందని తెలిసినా రాజీవ్‌ ధైర్యంగా రాజకీయాల్లో కొనసాగిన తీరును రాహుల్‌ గౌరవించేవారని తెలిపారు.

ప్రధాని పదవి వద్దన్నారు..
2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు నిరాకరించడం వెనుక ఎన్నో భావోద్వేగ సంఘర్షణలు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వెల్లడించారు. పార్టీ పట్ల తనకున్న బాధ్యత, వ్యక్తిగత భయాలు, దివంగత భర్త రాజీవ్ గాంధీ మార్గదర్శకత్వం లేకపోవడం.. ఇవన్నీ తనను అంతర్మథనానికి గురిచేశాయని తెలిపారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందే తాను ప్రధానమంత్రి అయ్యే అవకాశంపై కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో చర్చించినట్లు సోనియా(Sonia Gandhi Book Revelations) చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ విజయం సాధిస్తే ప్రధాని పదవిని స్వీకరిస్తారా? అని వారిలో ఒకరు నేరుగా అడిగారని, తాను మాత్రం కచ్చితంగా అంగీకరించబోనని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. రాహుల్‌, ప్రియాంక ఇద్దరూ తాను ప్రధాని కావడాన్ని ఇష్టపడలేదని తెలిపారు. చిన్నతనంలోనే నానమ్మ ఇందిరా గాంధీ హత్యను, తండ్రి రాజీవ్ గాంధీ దారుణ హత్యను చూసిన వారికి ప్రధాని పదవి అంటే మరింత ప్రమాదంతో కూడుకున్నదనే భావన ఉండేదని పేర్కొన్నారు.

మోదీ మొఖం తిప్పుకుంటారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు వ్యక్తిగతంగా పెద్దగా పరిచయం లేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వెల్లడించారు. అధికారిక కార్యక్రమాల్లో ఎదురుపడినప్పుడు నమస్కారం చేసుకోవడం మినహా ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ ఉండదని తెలిపారు. మోదీ తనను కలిసినప్పుడు కళ్లలోకి చూడకుండా మరోవైపు చూస్తారని ఆమె పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్ ఛాంబర్‌లో వివిధ పార్టీల నేతలు సమావేశమవుతుంటారని ఆమె వివరించారు. అలాంటి సందర్భాల్లో మోదీ ఎదురుపడితే ఇద్దరం మర్యాదపూర్వకంగా నమస్కారం చేసుకుంటామని సోనియా (Sonia Gandhi Book Revelations)చెప్పారు. గతంలో భిన్న రాజకీయ పార్టీలకు చెందిన నేతల మధ్య కూడా స్నేహపూర్వక సంబంధాలు ఉండేవని, ఇప్పటి పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రధాని కావాలని ప్రణబ్‌కు ఆశ
యూపీఏ హయాంలో తన పాత్ర గురించి సోనియా ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని తాను వెనకుండి నడిపించానంటూ వచ్చిన విమర్శలను ఆమె తోసిపుచ్చారు. దివంగత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఓసారి ప్రధాని కావాలని ఆశపడినట్లు తెలిపారు. యూపీఏ పాలనలో ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరంతో ప్రణబ్‌ ముఖర్జీకి ఓ సారి విభేదాలు తలెత్తడంతో దాని గురించి ఆయన తనవద్ద అసహనం వ్యక్తం చేశారని సోనియా (Sonia Gandhi Book Revelations)చెప్పారు. ప్రభుత్వ నాయకత్వాన్ని మార్చే సమయం వచ్చిందేమో అని ప్రణబ్‌ అన్నప్పుడు తాను ఆశ్చర్యపోయానన్నారు. బహుశా ప్రధాని కావాలన్న ఆయన ఆశను అలా బయటపెట్టి ఉంటారని అర్థమైందన్నారు.

అత్తమ్మ అంటే వణుకు
తన అత్తమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో ఉన్న అనుబంధం గురించి సోనియా బుక్‌లో రాసుకొచ్చారు. అత్తమ్మకు చాలా త్వరగా కోపం వస్తుందని, మొదట్లో తాను ఎంతగానో భయపడేదాన్నారు. ఓసారి సిబ్బంది ఒకరు ముఖ్యమైన అపాయింట్‌మెంట్‌ గురించి చెప్పడం మర్చిపోవడంతో అత్తమ్మ ఆగ్రహించారన్నారు. అంతేకాదు ఆ వ్యక్తిని గదిలో మూలన నిలబెట్టారని గుర్తు చేశారు. మరోసారి డైనింగ్‌ టేబుల్‌పై ప్లేట్‌ విసిరేశారు… వెంటనే అది చూసి తాను వణికిపోయానన్నారు సోనియా గాంధీ(Sonia Gandhi Book Revelations). భయపడకు.. అమ్మ కోపం క్షణకాలం అని అప్పుడు రాజీవ్‌ తనతో చెప్పారన్నారు. అత్తమ్మ గురించి పూర్తిగా తెలుసుకున్నాక.. ఆమె ఏంటో అర్థమైందన్నారు. ఇందిరాగాంధీకి చీరలంటే చాలా ఇష్టమని సోనియా తెలిపారు.