22 కిలోల వెయిట్ లాస్.. కీరవాణి మేకోవర్కి ఫిదా..!
ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తన సరికొత్త మేకోవర్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఏకంగా 22 కిలోల బరువు తగ్గి సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు.

MM Keeravani Weight Loss
కీరవాణి మిరాకిల్
ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తన సరికొత్త మేకోవర్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఏకంగా 22 కిలోల బరువు తగ్గి సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయనలో వచ్చిన ఈ మార్పును చూసి బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కీరవాణి పట్టుదల, క్రమశిక్షణ నిజంగా స్ఫూర్తిదాయకమంటూ ప్రశంసించారు. సంగీత ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఆయన.. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ పట్టుదలతో అనుకున్నది సాధించవచ్చని నిరూపించారని కొనియాడారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన అనుపమ్ ఖేర్.. తన స్నేహితుడు కీరవాణిని కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కీరవాణిలో వచ్చిన శారీరక మార్పును చూసి తానే షాక్ అయ్యానని చెప్పారు. ఏకంగా 22 (MM Keeravani Weight Loss)కిలోల బరువు తగ్గడం సాధారణ విషయం కాదని, అందుకు ఎంతో పట్టుదల, క్రమశిక్షణ అవసరమని పేర్కొన్నారు. కీరవాణి ఇప్పుడు మరింత ఫ్రెష్‌గా, ఉత్సాహంగా కనిపిస్తున్నారని అనుపమ్ ఖేర్ చెప్పారు. ఆయన నడకలోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోందని, ఎంతో సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నారని ప్రశంసించారు. ఈ మార్పు చూసి తనకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని వెల్లడించారు.
పట్టుదలలోనూ మేధావే!
కీరవాణిని ఉద్దేశించి అనుపమ్ ఖేర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. “మిస్టర్ కీరవాణి.. బిఫోర్ అండ్ ఆఫ్టర్! నా అత్యంత ప్రియమైన మిత్రుడు ఏకంగా 22 కిలోల బరువు తగ్గారు. ఆయన పట్టుదల నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. హైదరాబాద్ పర్యటనలో ఆయన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. కీరవాణి ఎంతో ఫ్రెష్‌గా, పూర్తి ఉత్సాహంతో ప్రపంచాన్ని జయించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించారు. ఆయన నడకలో ఒక కొత్త ఉత్సాహం కనిపించింది” అంటూ అనుపమ్ ఖేర్ తన పోస్టులో రాసుకొచ్చారు. అంతేకాదు.. “కీరవాణి (MM Keeravani Weight Loss)సర్.. మీరు సంగీతంలో ఒక మేధావి. ఇప్పుడు ఏకాగ్రత, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించారు. మీ జీవితంలో ప్రారంభమైన ఈ కొత్త అధ్యాయం మరింత విజయవంతం కావాలని కోరుకుంటున్నా మిత్రమా” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
MR. KEERAVANI-BEFORE AND AFTER!My dearest friend, the Oscar-winning music director M. M. Keeravani sir, has lost an incredible 22 kilos—and his determination is truly inspiring.😳😳
It was so wonderful to meet him during my trip to Hyderabad. He looked fresh, full of energy and ready to take on the world. There was a lovely bounce in his walk, and seeing him so happy and confident made me so proud.
Keeravani sir, you are a genius with music!! And now you’ve shown us what focus and determination can make possible. Here’s to your inspiring new chapter, my friend. So wonderful to see you! Jai Ho!😍😎👏👏 @mmkeeravaani #WeightLoss #Determination— Anupam Kher (@AnupamPKher) November 13, 2026
వారణాసి సినిమాతో బిజీ
మరోవైపు ఎంఎం కీరవాణి ప్రస్తుతం దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’కి సంగీతం అందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కీరవాణి తన సంగీతంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఫిట్‌నెస్‌లోనూ కొత్త మార్పు కనిపించడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. సాధారణంగా సెలబ్రిటీల మేకోవర్లు అభిమానులను ఆకట్టుకుంటుంటాయి. కానీ కీరవాణి విషయంలో 22 కిలోల బరువు తగ్గడం(MM Keeravani Weight Loss) కేవలం రూపంలో వచ్చిన మార్పు మాత్రమే కాదు.. ఆయన సంకల్పబలానికి నిదర్శనంగా అనుపమ్ ఖేర్ అభివర్ణించడం విశేషం. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు, అనుపమ్ ఖేర్ చేసిన ప్రశంసలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.



