స్టింగ్ ఆపరేషన్ లొల్లి.. కర్నాటకలో పొలిటికల్ కాక
కర్నాటకలో సీఎం డీకే శివకుమార్.. కేంద్రమంత్రి కుమారస్వామి మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఓ వ్యాపారవేత్తతో కలిసి స్టింగ్ ఆపరేషన్‌కి పాల్పడ్డారంటూ డీకే చేసిన కామెంట్స్‌కు కుమారస్వామి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తన కుటుంబాన్ని రాజకీయంగా అంతం చేసేందుకు రూ. 600 కోట్ల సుపారీ ఇచ్చారంటూ డీకేపై ఆరోపణలు చేశారు.

Karnataka Sting Operation
కర్నాటకలో పొలిటికల్ కామెంట్స్ కాకరేపుతున్నాయి. తనను కలిసేందుకు వచ్చిన ఓ బిజినెస్ మ్యాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్‌తో స్టింగ్ ఆపరేషన్ చేశారంటూ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయంశంగా మారాయి. అంతేకాదు ఆ బిజినెస్ మ్యాన్ కి కేంద్రమంత్రికి లింక్ చేస్తూ డీకే శివకుమార్ చేసిన కామెంట్స్ .. ఇప్పుడు కర్నాటక కాంగ్రెస్- JDS మధ్య మాటల యుద్దానికి దారితీసింది. డీకే వ్యాఖ్యలకు దీటుగా కౌంటర్ ఇస్తున్నారు కేంద్రమంత్రి హెడ్డీ కుమారస్వామి. తన కుటుంబాన్ని అంతం చేసేందుకు సీఎం డీకే శివకుమార్ రూ. 600కోట్ల సుపారీ (Karnataka Sting Operation)కుదుర్చుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కర్నాటక హోంమంత్రి ప్రియాంక ఖర్గే, సీఎం డీకే కలిసి తమ పార్టీని, మాజీ ప్రధాని దేవగౌడ కుటుంబాన్ని రాజకీయంగా అంతం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని హెడ్డీ కుమారస్వామి ఆరోపించారు. మాజీ సీఎం సిద్దరామయ్యకు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వ్యవహారాన్ని తమపై నిందలు మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు.
నాకుటుంబంపై కుట్ర..!
తమ కుటుంబానికి రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని .. అందులో భాగంగానే రూ. 600 కోట్ల సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నారని సీఎం డీకే శివకుమార్‌పై మండిపడ్డారు కేంద్రమంత్రి కుమారస్వామి. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర స్పష్టమైన ఉన్నాయన్నారు. హాసన్ జిల్లాలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో పూజలు చేసిన తర్వాత కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. స్టింగ్ ఆపరేషన్ కేసు దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తన వైపు మళ్లిస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని స్పష్టమైన ఆధారాలు ఇచ్చినప్పటికీ.. తనను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. ఇలాంటి కుట్రలకు భయపడేదే లేదన్నారు. ఇలాంటి కుట్రను చేధించడం మాపార్టీకి కొత్తమీ కాదన్నారు.
డైవర్షన్ పాలిటిక్స్
కర్నాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్(KPSC )కుంభకోణం నుంచి తప్పించుకునేందుకే స్టింగ్ ఆపరేషన్ అంటూ ప్రజలను డైవర్ట్ చేస్తున్నారని .. పొలిటికల్‌గా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కుమారస్వామి మండిపడ్డారు. స్టింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్న వారిని ప్రభుత్వం కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మరోవైపు స్టింగ్ ఆపరేషన్ 80శాతం పూర్తయిందని హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కుమారస్వామి కౌంటర్ ఇచ్చారు. KPSC కుంభకోణం 90శాతం పూర్తయితే కప్పిపుచ్చేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తనకు సన్నిహితంగా ఉండి.. స్టింగ్ ఆపరేషన్(Karnataka Sting Operation)లో పాల్గొన్న నిందితులు పారిపోయారంటూ హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. జర్నలిస్ట్ రాకేశ్శెట్టి.. కాంగ్రెస్ నేత కృప అల్వా, వారికి సన్నిహితంగా ఉన్న కొందరు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారని కుమార స్వామి అన్నారు. స్టింగ్ ఆపరేషన్ దర్యాప్తుపై మాజీ సీఎం సిద్దరామయ్యకు సైతం అనుమానాలు ఉన్నాయన్నారు.
నిరసనలకు వెనుకాడం..
సిద్దరామయ్యను కేవలం పదవి నుంచి తొలగించేందుకే కుట్రలతో స్టింగ్ ఆపరేషన్ చేసి.. తిరిగి ఎదుటివారిపై ఆనిందలు వేస్తున్నారని కుమార్ స్వామి అన్నారు. సిద్ధరామయ్యకు జరిగిన అన్యాయానికి బాధ్యులైన అసలు నిందితులను పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2023 కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి నిర్వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టింగ్ ఆపరేషన్ ద్వారా రాజకీయ లబ్ధి పొందింది ఎవరని ప్రశ్నించారు. స్టింగ్ ఆపరేషన్ ద్వారా సీఎం అయింది డీకే కాదా? అని ప్రశ్నించారు. తనకు .. తన పార్టీకి కుట్రలు ఎదుర్కొవడం కొత్తమే కాదన్నారు. ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టమని .. నిజాలు కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
డీకే మాటలతో లొల్లి స్టార్ట్..
కుమారస్వామికి ముందు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కర్నాటక సీఎం డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ సీఎంలకు రక్షణ లేదన్నారు. బీజేపీ, ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రులకు కాకుండా కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీఎంలను టార్గెట్‌గా చేస్తున్నారని.. స్టింగ్ ఆపరేషన్లు మొదలుపెట్టారని ఆరోపించారు. కేరళ సీఎం వీడి సతీశన్‌తో పాటు తనను లక్ష్యంగా చేసుకుని స్టింగ్ ఆపరేషన్(Karnataka Sting Operation)కు ప్రయత్నించారని ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం డీకే చెప్పారు. ఓ వ్యాపారవేత్త అధికారుల ద్వారా తనను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకుని బిజినెస్ గురించి మాట్లాడేందుకు తన ఛాంబర్‌కి వచ్చారని తెలిపారు డీకే. తనతో మాట్లాడేందుకు వచ్చేటప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి వచ్చారని .. అది చూసిన వెంటనే తనకు అనుమానం వచ్చిందన్నారు. అయినా తనతో మాట్లాడనని చెప్పారు. ఆ వ్యక్తి ఫస్ట్ వ్యాపారాల గురించి డిస్కషన్ స్టార్ట్ చేసి.. క్రమంగా రాజకీయాలు, బూత్ స్థాయి వ్యూహాలు, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మాట్లాడం మొదలు పెట్టారని చెప్పారు. తనకు అతని మాటతీరుపై అనుమానం కలిగి విచారణ చేయాలని అధికారులను ఆదేశించానన్నారు. విచారణ తర్వాత అధికారుల నుంచి తెలుసున్న విషయాలను విని తాను విస్తుపోయానని చెప్పారు. ఆ బిజినెస్ మ్యాన్ తనకంటే ముందుకు కేరళ సీఎంను కలిశారని.. ఆయనను కలినప్పుడు కూడా అదే మెటా స్మార్ట్ గ్లాసెస్ పెట్టుకుని ఉన్నారని తెలిందన్నారు. అయితే సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫగ్నవీస్తో పాటు ఓ కేంద్రమంత్రిని కలిసినప్పుడు మాత్రం మెటా స్మార్ట్ గ్లాసెస్ పెట్టుకోలేదన్నారు. మెటా స్మార్ట్ గ్లాసెస్ ద్వారా అతను రహస్యంగా తనవి, వీడి సతీశన్ మాటలను చిత్రీకరించేందుకు యత్నించారని.. ఆవిషయం అధికారులు విచారణలో నిర్థారణ అయిందన్నారు. ఆ వ్యాపార వేత్త స్టింగ్ ఆపరేషన్ గురించి తెలిసిన వెంటనే తాను మంత్రి వర్గ సహచరులను అప్రమత్తం చేశారనన్నారు డీకే. అలా చేయడం కూడా తన బాధ్యత అని చెప్పారు డీకే. మంత్రులు, వ్యక్తిగత సహాయకులు, ఫోన్ కాల్స్ ద్వారా జరిగే ఉచ్చులో పడొద్దని నిరంతరం అలర్ట్‌గా ఉండాలని ఆదేశించనన్నారు. అయితే స్టింగ్ ఆపరేషన్‌కి పాల్పడిన వ్యక్తి వివరాలు ఇప్పుడు తాను వెల్లడించలేనని.. సమయం వచ్చినప్పుడు బయటపెడతానన్నారు. ఆ విషయాలు బయటకు చెప్పే టైం ఇది కాదన్నారు.
డీకే చేసిన కామెంట్స్ తర్వాత కార్నాటకలో కాంగ్రెస్- జేడీఎస్ మధ్య రాజకీయ రగడ నెలకుంది. కర్నాటక సీఎం చేసిన వ్యాఖ్యలు అదే స్థాయిలో కేంద్రమంత్రి కుమారస్వామి మాటలదాడికి దిగారు. దీంతో స్టింగ్ ఆపరేషన్(Karnataka Sting Operation) గొడవ రాష్ట్ర రాజకీయాలనే కాదు.. దేశ్ వ్యాప్తంగా హాట్ టాఫిక్ అయ్యాయి. ముందుముందు ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనన్న ఆసక్తి రేకెత్తిస్తోంది.



