Congress Worried Over Slow Voter Registration

వచ్చే ఏడాదిమార్చిలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గతానికి భిన్నంగా అభ్యర్థుల ఎంపికలోనే ముందడుగు వేసింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానం నుంచి సామ రామ్మోహన్ రెడ్డి, వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించింది. అంతేకాదు.. నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగిస్తూ, ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులను ఎన్నికల క్షేత్రంలోకి దింపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఈ ఎన్నికలపై ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు స్థానాల్లో బంపర్‌ మెజార్టీతో విజయం సాధించాలని(Congress Worried Over Slow Voter Registration) నేతలకు టార్గెట్ పెట్టారు.

పీసీసీ అసహనం.. ఇలా అయితే కుదరదు

ఎన్నికల్లో గెలవాలంటే అభ్యర్థులను ప్రకటిస్తే సరిపోదు.. ఓటర్లను గుర్తించాలి.. అర్హులైన గ్రాడ్యుయేట్లను నమోదు చేయించాలి.. ప్రతి దరఖాస్తునూ ఫాలోఅప్ చేయాలి. కానీ ఈ కీలకమైన బాధ్యతల్లోనే కొందరు నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు పీసీసీ చీఫ్‌కు చేరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఇన్‌ఛార్జ్ మంత్రులు సమన్వయంతో పనిచేయాల్సి ఉండగా.. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొందరు నేతలు ఓటరు నమోదు కోసం పేరుకు మాత్రమే బృందాలను ఏర్పాటు చేసి, ఆ తర్వాత వాటి పనితీరుపై సరైన పర్యవేక్షణ(Congress Worried Over Slow Voter Registration) చేయలేదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఆశించిన వేగం కనిపించడం లేదంటూ పీసీసీకి నివేదికలు అందుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై వస్తున్న నివేదికలు ఇప్పుడు పీసీసీ నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి.దీంతో పదేపదే సూచనలు చేసినా క్షేత్రస్థాయిలో మార్పు కనిపించకపోవడంపై మహేష్ కుమార్ గౌడ్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.సీఎం, పీసీసీ ఆదేశాలు ఇవ్వమేకానీ.. గ్రౌండ్‌లెవల్‌లో ఆస్థాయిలో వర్క్‌ జరగడం లేదనే టాక్ వినిపిస్తోంది.

స్పీడ్ లేదు.. జోరు పెంచాలి..

ముఖ్యంగా హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నమోదు ఆశించిన స్థాయిలో జరగడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నల్లగొండ–ఖమ్మం–వరంగల్ నియోజకవర్గంలోనూ సేమ్ సీన్‌. మరోవైపు అక్టోబర్ 15 నాటికి రెండు నియోజకవర్గాల్లో కలిపి కేవలం 3.55 లక్షల దరఖాస్తులే అందాయని నివేదికలు వెల్లడించాయి. గత ఎన్నికల్లో నమోదైన 10.36 లక్షల ఓటర్లతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే. సాంకేతిక సమస్యల కారణంగా నవంబర్ 6తో ముగియాల్సిన దరఖాస్తుల గడువును నామినేషన్ల చివరి(Congress Worried Over Slow Voter Registration) తేదీ వరకు పొడిగించినట్లు నవంబర్ 3న ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఇక ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 25న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానుంది. డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, మార్పులకు అవకాశం ఉండగా.. డిసెంబర్ 30న తుది జాబితా ప్రకటించనున్నారు. అంటే కాంగ్రెస్‌కు ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ.. ఈలోగా యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది. మరి మహేష్ కుమార్ గౌడ్ అసంతృప్తితోనైనా నేతల్లో కదలిక వస్తుందా? మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేస్తారా? లేక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదే కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.