జనసేనలోకి వంగవీటి రాధా.. విజయవాడ మేయర్ కన్ఫార్మ్!
Vangaveeti Radha Janasena: వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా త్వరలో జనసేనలో చేరారు. ప్రస్తుత తెలుగుదేశం పార్టీలో ఉన్న రాధా.. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా పోటీ చేయనున్నారు.

Vangaveeti Radha Janasena: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఏపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మేయర్, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ పదువులు పొందేందుకు నేతలు వరుసపెట్టి పార్టీలు మారుతున్నారు. ఇదే క్రమంలో మెడలో కండువాలు సింఫుల్‌గా మారుస్తున్నారు. విజయవాడ మేయర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాఫిక్ మారింది. తాజా ఎన్నికల్లో విజయవాడ మేయర్ జనరల్ స్థానానికి కేటాయించారు. మేయర్ పదవి కోసం విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టీడీపీ నుంచి జనసేనలో చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన రాధాను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న పవన్ స్వాగతం పలికారు. తన అనుచరులను పవన్‌కి రాధా పరిచయం చేశారు. అనంతరం పార్టీలోకి ఆశ్వానించిన పవన్.. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టిగా ముందుకెళ్దామని రాధాకు దిశానిర్దేశం చేశారు.
వంగవీటి రాధా ఇప్పటివరకు కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైసీపీ, టీడీపీ ..ఇప్పుడు తాజాగా జనసేన పార్టీలో చేరారు. అయితే ఎప్పటినుంచో రాధాను పార్టీలోకి పవన్ ఆహ్వానిస్తున్నారు. కాని రాధా 2019 ఎన్నికలకు ముందు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీని కాదని టీడీపీలో చేరారు. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటున్నారని.. తనను శాసిస్తున్నారని ఆరోపించారు. 2019 ఎన్నికల ముందు మచిలీపట్నం ఎంపీ సీటుకాని.. పెడన ఎమ్మెల్యే సీటు కాని కట్టబెట్టి టీడీపీ నుంచి పోటీ చేస్తారనే టాక్ నడిచింది. కాని అవేమి జరగలేదు. కూటమి గెలుపు కోసం రాధా తీవ్రంగా శ్రమించారు. ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయన చేసిన సేవలకుగాను కనీసం ఎమ్మెల్సీ ఇస్తారనే టాక్ నడిచినా అదీ జరగలేదు. ఇప్పుడు సరైనా టైంలో విజయవాడ మేయర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రాధా మెగ్గుచూపుతున్నారు. ఇప్పటికే పొత్తులో భాగంగా విజయవాడ మేయర్ సీటు జనసేనకు కన్ఫార్మ్ కావడంతో.. దీంతో టీడీపీ నుంచి అవకాశం లేకపోవడంతో జనసేన నుంచి రాధా పోటీకి సిద్ధమయ్యారు. అందుకే జనసేనలో చేరారు. అయితే రాధా జనసేన చేరడం అటు జనసేనకు.. ఇటు రాధాకి ఇద్దరికి కలిసొచ్చే అంశమనే టాక్ నడుస్తోంది. జనసేన కేడర్, మరోవైపు కాపు సామాజిక వర్గం రాధాకి మరింత దగ్గరవుతుందని చెప్తున్నారు. అటు రాధాకూడా చాలా కాలంగా పదవులకు దూరంగా ఉన్నారు. దీంతోనైనా ఆయన అభిమానుల ఆశలు తీరబోతున్నాయి. మరోవైపు జనసేనకు విజయవాడలో సరైన నాయకుడు లేరు. రాధా రాకతో జనసేనలో ఉన్న ఆ వెలితి పూడుతుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.



