South Vs North, Regina Controversy Comments

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రెజీనా కసాండ్రా . విభిన్నమైన పాత్రలు, లేడీ ఓరియంటెండ్ సినిమాలతో ప్రేక్షకుల మననుసు చొరగొంటున్నారు. ప్రస్తుతం తన కెరీర్‌లో కొత్త తరహా పాత్రలతో ముందుకు సాగుతున్నారు. ఇటీవల నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలపై ఆసక్తి చూపిస్తోంది. తాజాగా నయనతార నటించిన ‘మూకుత్తి అమ్మన్ 2’లో విలన్‌గా నటించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రెజీనా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా నయనతారకు ఏర్పాటు చేసిన భారీ కటౌట్‌పై రెజీనా స్పందించింది. ఇప్పటివరకు స్టార్ హీరోలకు మాత్రమే భారీ కటౌట్లు ఏర్పాటు చేసే సంప్రదాయం ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు నయనతార, రాధిక వంటి నటీమణులకు కూడా అలాంటి గుర్తింపు రావడం మంచి పరిణామమని అభిప్రాయపడింది.

వివక్ష చూపారు..!
ఇక బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు రెజీనా కసాండ్రా. ముఖ్యంగా దర్శక నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాను నటించిన ‘కేసరి చాప్టర్ 2’ సినిమా ప్రమోషన్లలో తనను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారని ఆరోపించారు. సౌత్ హీరోయిన్‌ కావడం వల్లే తనపై వివక్ష చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. రెజీనా చేసిన ఈవ్యాఖ్యలు భారత సినీ పరిశ్రమలో ‘నార్త్ వర్సెస్ సౌత్’ (South Vs North, Regina Controversy Comments)అనే చర్చను మరోసారి రాజేశాయి. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘కేసరి 2’లో ఆయన భార్యగా రెజీనా కీలక పాత్ర పోషించారు. అయితే ప్రమోషన్ల సమయంలో తన పేరును తొలగించారని రెజీనా ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు తనపై చిత్రీకరించిన పాటను విడుదల చేసి, సోషల్ మీడియాలో కనీసం ట్యాగ్ కూడా చేయలేదన్నారు. తాను కేవలం సౌత్ ఇండియన్ హీరోయిన్‌ కావడం వల్లే ఇలా చేశారా? అని రెజీనా ప్రశ్నించారు.

రెజీనా కౌంటర్‌..!
అంతేకాదు.. ఇటీవల టాలీవుడ్‌పై నార్త్ హారోయిన్స్‌ జాన్వీ కపూర్‌, రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్యలపైన సీరియస్‌గా స్పందించారు రెజీనా కసాండ్రా. సినిమాలో ఏదైనా సన్నివేశం నచ్చకపోతే, అసౌకర్యంగా అనిపిస్తే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని సూచించింది. నటించిన తర్వాత సినిమా చిత్రీకరణ విధానంపై విమర్శలు చేయడం కంటే ముందే తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పాలని పేర్కొంది. నార్త్‌ హీరోయిన్స్ సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇలాంటి వ్యాఖ్యలు నార్త్, సౌత్ మధ్య(South Vs North, Regina Controversy Comments) విభేదాలను పెంచే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది.

జాన్వీ ఏమన్నారంటే..
రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాలో నటించిన జాన్వీ కపూర్ తన పాత్రను చిత్రీకరించిన విధానంపై విమర్శలు రావడంతో స్పందించారు. సినిమా షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాల విషయంలో తాను మరింత అప్రమత్తంగా ఉండాల్సిందని చెప్పింది. సౌత్‌లో(South Vs North, Regina Controversy Comments) చాలా అరుదుగా పూర్తి స్థాయి బౌండ్ స్క్రిప్ట్ ఉంటుందని, కెమెరా యాంగిల్స్ ముందుగానే చూసే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుందన్నారు. దర్శకుడు చెప్పిన విధానాన్ని అనుసరించే క్రమంలో కొన్ని విషయాలు తనకు తర్వాతే అర్థమయ్యాయని తెలిపింది. సినిమాలో తన పాత్ర చిత్రీకరణ కొన్ని సందర్భాల్లో తనకు అసౌకర్యంగా, బాధాకరమైన అనుభవంగా అనిపించిందని పేర్కొంది.

నార్త్ వర్సెస్ సౌత్
నటి రాధికా ఆప్టే దక్షిణాది సినిమాల్లో నటించిన తన అనుభవాలను పంచుకుంటూ మరో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించింది. దక్షిణాది సినిమాల్లో ఉత్తరాది నుంచి వచ్చిన తెల్లని చర్మం కలిగిన హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అలాగే దక్షిణాది సినిమా సెట్స్‌లో కొన్ని విషయాలు స్నేహపూర్వకంగా, అనధికారికంగా జరిగేవని, కొన్నిసార్లు వ్యక్తిగత పరిచయాల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యేవని కూడా చెప్పింది. జాన్వీ కపూర్ వ్యాఖ్యలు మహిళా పాత్రల చిత్రీకరణ, నటీమణుల నిర్ణయాధికారం గురించి చర్చకు దారితీయగా, రాధికా ఆప్టే వ్యాఖ్యలు స్థానిక నటీమణులకు అవకాశాలు అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. రెజీనా స్పందనతో ఈ చర్చ నార్త్ వర్సెస్ సౌత్ (South Vs North, Regina Controversy Comments)వివాదంగా మారింది.ఈ నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు ఇచ్చే ప్రాధాన్యత, షూటింగ్ పద్ధతులు, నటీమణుల అభిప్రాయాలకు ఇచ్చే విలువపై మరోసారి చర్చ మొదలైంది.