కష్టాల్లో ఉన్నవారి బాధపెట్టొద్దు.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్
తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన మూడో భార్యతో విడాకులు. అన్నా లెజినోవాతో పవన్ విడిపోయిన వేళ పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్, విమర్శలు వస్తున్న తరుణంలో రేణూ దేశాయ్ పరిపక్వతతో కూడిన సందేశం ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Renu Desai Emotional Message
ఘాటు సందేశం!
తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన మూడో భార్యతో విడాకులు. అన్నా లెజినోవాతో పవన్ విడిపోయిన వేళ పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్, విమర్శలు వస్తున్న తరుణంలో రేణూ దేశాయ్ పరిపక్వతతో కూడిన సందేశం ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. కష్టకాలంలో ఉన్నవారి పట్ల సానుభూతితో వ్యవహరించాలని ఆమె ఇచ్చిన పిలుపునకు విస్తృత మద్దతు లభిస్తోంది. పవన్, అన్నా లెజినావో విడిపోవడంపై ఆమె ఎవరి పేర్లను నేరుగా ప్రస్తావించకపోయినా.. ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారంటూ పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. కష్టాల్లో ఉన్న వ్యక్తిపై విమర్శలు చేయడం ఏమాత్రం సంస్కారం కాదంటూ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు రేణుదేశాయ్(Renu Desai Emotional Message). ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు వారిని మరింతగా దూషించడం నైతికంగా సరైన విషయం కాదన్నారు. ఇప్పటికే కిందపడిపోయిన వారిని ఇంకా తొక్కాలని చూడటం పూర్తిగా అమానుషం అని అభిప్రాయపడ్డారు. సమాజంలో ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా, చివరికి వాళ్లూ ఒక మనిషే అన్న సంగతి ఎవరూ మర్చిపోకూడదన్నారు. ప్రతి ఒక్కరూ ఎవరికో ఒకరికి సంతానంగానో, తల్లిదండ్రులుగానో లేదా తోబుట్టువుగానో ఉంటారని గుర్తుచేశారు రేణు దేశాయ్.
గాజు మేడలో ఉండి రాళ్లు వేయొద్దు..!
అలాగే వ్యక్తి గత విమర్శల విషయంలోను ఘాటుగా స్పందించారు రేణుదేశాయ్. మనమే గాజు మేడల్లో నివసిస్తున్నప్పుడు, ఇతరుల ఇళ్లపై రాళ్లు విసరడం మానుకోవాలని సూచించారు. వాళ్లు తిరిగి రాళ్లు విసిరితే ఏమవుతుందో తెలుసుకదా అన్నారు. మనమంతా మనుషులం.. మనిషి అని పిలిపించుకోవడానికి సానుభూతి, దయ అనేవి ప్రాథమిక అవసరాలని రేణు దేశాయ్(Renu Desai Emotional Message) హితవు పలికారు. అంతేకాదు.. ఈపోస్ట్ ఆధారంగా తనపై ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయోద్దని సూచించారు. నేను ఈమాటలు రాసినంత మాత్రన తప్పుగా అపార్థం చేసుకోవద్దని.. అర్థంలేని ఊహాగానాలు చేయొద్దని సూచించారు. ఒక సమాజంగా మనం ఇంతకంటే మెరుగ్గా ఆలోచించగలమని తాను బలంగా నమ్ముతున్నాను. దయతో కూడిన, తెలివిగల మాటలు మాట్లాడటానికి నాకేమీ పేటీఎం ద్వారా డబ్బులు అందలేదన్నారు. పనిచేసే మెదడు ఉన్న ఒక మనిషిగా పరిస్థితులను గ్రహించి మాత్రమే నేను స్పందిస్తున్నానంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు రేణు దేశాయ్.
నో కామెంట్ బ్రో..!
మరోవైపు పవన్, అన్నా కొణిదెల విడాకుల అంశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికరంగా స్పందించారు. పవన్ కల్యాణ్ వివాహాలు, విడాకులు అనేవి పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయమని, వాటి గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ అంశంపై మాట్లాడేందుకు నిరాకరించారు. కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ విడాకుల అంశంపై విలేకరులు ప్రశ్నించగా, అంబటి దాటవేశారు.



