బతకనివ్వరా.. నన్ను నన్నుగా గుర్తించరా?
తెలుగు ప్రేక్షకులపై నటి, రచయిత, డైరెక్టర్ రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌తో తనకు విడాకులు జరిగి 14 ఏళ్లు గడిచినా.. . ఇంకా తనను ప్రత్యేకంగా చూడడం లేదని..అసలు నా ఐడెంటిటీ ఎక్కడ? అని ప్రశ్నించారు.

Renu Desai Emotional Comments
తెలుగు ప్రేక్షకులపై నటి, రచయిత, డైరెక్టర్ రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌తో తనకు విడాకులు జరిగి 14 ఏళ్లు గడిచినా.. . ఇంకా తనను ప్రత్యేకంగా చూడడం లేదని.. పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే .. అదే గుర్తింపుతోనే తనను చూస్తున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక మహిళకు తనకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం, కెరీర్, విజయాలు ఉండవా? .. అసలు నా ఐడెంటిటీ ఎక్కడ?(Renu Desai Emotional Comments) అని ప్రశ్నించారు. ‘బద్రి’ సినిమాతోనే తన జీవితం మొదలైందని అనుకోవడం కరెక్ట్ కాదన్నారు. అంతకుముందు కూడా తనకంటూ ఓ ప్రపంచం ఉందని గుర్తుచేశారు.
వనవాసం వీడేదెప్పుడు?
శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం తర్వాత తిరిగి అయోధ్యకు తిరిగి వచ్చారు. అయితే తాను, పవన్ కల్యాణ్ విడిపోయి 14 ఏళ్లు గడిచినా తనను సపరేట్గా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఈ వనవాసం ఎప్పుడు ముగుస్తుందంటూ రేణుదేశాయ్ ఎమోషనల్ అయ్యారు. తాను పవన్ తో విడిపోయాకా..నా కంటూ ఓ ప్రయాణాన్ని స్టార్ట్ చేశానన్నారు. 2012లో విడాకులు మంజూరైన తర్వాత మరాఠీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వర్క్ చేశాని అది మంచి విజయం సాధించిందని గుర్తు చేశారు. అంతేకాదు మరో సినిమాకు కథ అందించడంతో పాటు నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలూ చేసినట్లు వెల్లడించారు. డ్యాన్స్ షోలకు పనిచేశానని, కవితలు రాశానని, ప్రస్తుతం కూడా నటిగా కొనసాగుతున్నానని చెప్పారు. ఇన్ని రంగాల్లో రాణిస్తుంటే .. నా ఐడెంటిటీ ఎక్కడ? (Renu Desai Emotional Comments)అని క్వశ్చన్ చేశారు. ఇంకా పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే గుర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తన ప్రతిభను, కష్టాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత సంబంధానికే పరిమితం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ట్రోలర్స్‌కి కౌంటర్
ఇక సోషల్ మీడియా వేదికగా తనకు ఎదురవుతున్న ట్రోలింగ్‌పైనా రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. తాను ఓ మూగజీవిని కాపాడినా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌తో తనకున్న గత సంబంధాన్ని ఆధారంగా చేసుకుని.. తన ప్రతి చర్యనూ అదే కోణంలో చూడటం బాధాకరమన్నారు. ఆయన లేకపోతే ఆమెకు జీవించే అర్హతే లేదన్నట్టుగా కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక మహిళ తన గతాన్ని దాటి స్వతంత్రంగా జీవించకూడదా? తనకంటూ గుర్తింపు సంపాదించుకోకూడదా? అని ప్రశ్నించారు. ఆయది ఒక జీవితం.. నాదోక జీవితం.. నాకు ఆయనను జోడించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మొత్తానికి రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు(Renu Desai Emotional Comments) మరోసారి వ్యక్తిగత స్వేచ్ఛ, మహిళల గుర్తింపు, సోషల్ మీడియా బాధ్యతపై చర్చకు తెరలేపాయి.



