Rayachoti Clash Between YSRCP and TDP: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అన్నమయ్య జిల్లా రాయచోటి ఎస్ ఎన్ కాలనీలో తీవ్ర ఉద్రక్తత చోటు చేసుకుంది… టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదంలో టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.. ఇరు వర్గాలకు చెందిన వాహనాలు మంటల్లో దగ్దమయ్యాయి..కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడుల్లో దాదాపు 15 వాహనాలు దగ్దమయ్యాయి.. వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన కొద్దీ సేపటికి ఈ ఘటనా జరిగింది.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీ దాడులు చేయించారని వైసీపీ ఆరోపిస్తోంది.. రాయచోటి ఎస్ ఎన్ కాలనీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.మరోపక్క పుంగనూరులో కూడా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్ కేంద్రంలో మిథున్ రెడ్డి ఉండటంతో వారిని బయటికి పంపించాలని టీడీపీ డిమాండ్ చేసింది. దీంతో వివాదం రాజుంకుంది.అభ్యర్ధుల్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పిన కొద్దిసేపటికి ఈ ఘటన చోటుచేసుకుంది.