Rashmika Hits Back at Trolls

వివాదానికి కారణం..!
సోషల్ మీడియాలో మరో పెద్ద చర్చ నడుస్తోంది. లేటెస్ట్ కఫుల్స్ విజయ్‌ దేవరకొండ, రష్మికమందన్న విడుపోతున్నారంటూ గత రెండు రోజులుగా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇస్టాగ్రామ్‌ లో రష్మికను విజయ్‌ అన్‌ ఫాలో చేశారని టాక్‌ ఆఫ్‌ది సోషల్ మీడియాగా మార్చేశారు. అంతేకాదు.. ఇటీవల కాఫీ విత్ కరణ్‌-9 ప్రొగ్రాంకి విజయ్‌ దేవరకొండ, రష్మిక హాజరయ్యారు. అక్కడ ఈజంట తమ పెళ్లి గురించి మాట్లాడారు. అక్కడ రష్మిక చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. పెళ్లిచేసుకోమని విజయ్‌ని ఏడాదిపాటు అడిగానని రష్మిక ఆషోలో చెప్పారు. దాదాపు వందసార్లు అడిగితే కాని విజయ్‌ అంగీకరించలేదని తెలిపింది. దీంతో షోలో రష్మిక మాట్లాడిన మాటలు చర్చకు దారి తీశాయి. రష్మికను విజయ్‌ అవమానించారని ..కొందరు సోషల్ మీడియాలో విమర్శలు స్టార్ట్ చేశారు.

రష్మిక ఘాటు రిప్లై..
సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై రష్మిక ఘాటుగా స్పందించారు. నాపెళ్లి.. నా ప్రేమ నాఇష్టం. ఈ విషయంలో ఎవరో ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని.. తీర్పులు కూడా చెప్పాల్సిన పనిలేదని కౌంటర్ ఇచ్చారు. ఇది నా లైఫ్… నాకు ఇష్టమైన వారిని సెలక్ట్ చేసుకునే హక్కు నాకుఉంది అంటూ గట్టిగా రిప్లై (Rashmika Hits Back at Trolls)ఇచ్చారు. అంతేకాదు.. విజయ్‌ని వందసార్లు కాదు.. వెయ్యి సార్లైనా అడుగుతానని దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. విజయ్‌ను మళ్లీ మళ్లీ ఎంచుకుంటానన్నారు. మీరు అనుకుంటున్నట్లు వందసార్లు నేను విజయ్‌ని అడగడం పెద్ద విషయమే కాదని ట్రోలర్లకు బుద్దిచెప్పారు. తమ గురించి విచారించడం మానేసి ఎవరికి వారు తమ సొంత విషయాలపై దృష్టి పెట్టి సంతోషంగా ఉండాలని హితవు పలికారు రష్మిక.

కష్టాల్లో తోడున్నది అతనే
నేను భావోద్వేగాలతో నిర్ణయం తీసుకుంటా.. కాని విజయ్ మాత్రం అలా కాదన్నారు. అన్ని కోణాల్లో ఆలోచిస్తాడనని చెప్పింది. మాకున్న ఆఅలవాట్లే మాబంధానికి బలమని చెప్పుకొచ్చారు. నాకు కష్టాలు ఎదురైనప్పుడు విజయ్‌ ఒక్కడే అండగా నిలిచాడని చెప్పింది రష్మిక. ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చినా.. ఆందోళనతో నిద్రపట్టకపోయినా.. అతడే నాపక్కన ఉన్నాడని తెలిపింది. కొన్నేళ్ల క్రితం కష్టాలను ఎదుర్కొన్న సమయంలో నాపక్కన ఎవరూ లేరని.. విజయ్‌ మాత్రమే తనకు తోడుగా.. అండగా నిలిచాడని తెలిపారు. ప్రస్తుతం తాము ఎంతో సంతోషంగా.. సంతృప్తికర జీవితం కడుపుతున్నామని.. జీవితాన్ని నచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నామన్నారు. విజయ్‌ని ఎంచుకున్నందుకు సంతోషంగా ఉన్నామని చెప్పింది. అసలు మా కుటుంబాల గురించి తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని రష్మిక తప్పుబట్టింది. మరోవైపు ట్రోల్స్‌(Rashmika Hits Back at Trolls)పై విజయ్‌ కూడా స్పందించారు. రష్మిక నా భార్య.. ఆమెతో జీవితం పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు విజయ్‌.

పోలీసులకు ఫిర్యాదు
విజయ్‌, రష్మికపై అనవసరపు ట్రోలింగ్ చేసే వారిపై పోలీసులు ఫిర్యాదు(Rashmika Hits Back at Trolls) చేశారు విజయ్, రష్మిక మేనేజింగ్ టీం. తప్పుడు ఆన్‌లైన్ కంటెంట్, మార్ఫింగ్ చేసిన స్క్రీన్‌షాట్లు, నకిలీ గుర్తింపులు, ఆన్‌లైన్ వేధింపులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశారు మేనేజర్ . రష్మిక, విజయ్‌ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.