రామాయణపై శూర్పణఖ ఎమోషన్.. మహేష్ ఫిదా
రామాయణ సినిమా సూపర్ సక్సెస్ తో దూసుకుపోతోంది. స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు, హీరోయిన్ లు సైతం సినిమాను చూసి ప్రసంశలు కురిపిస్తున్నారు. సినిమా అద్భుతమంటూ కితాబిస్తున్నారు.

Ramayana Review
బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘రామాయణ’ సినిమా దూసుకుపోతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. విజువల్ వండర్ అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు, స్టార్ డైరెక్టర్లు, సినీ నటులు తన భావావాలను పంచుకుంటున్నారు. తాజాగా రామాయణ చిత్రంపై .. ఈ సినిమాలో కీలకమైన శూర్పణఖ పాత్ర చేసిన రకుల్ ప్రత్ సింగ్(Ramayana Review) స్పందించారు. సినిమా సూపర్‌గా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. శూర్పణఖ పాత్రలో నటించడంపై హర్షం వ్యక్తం చేశారు. తన అనుభవాలను, సంతోషాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
రకుల్ ఎమోషన్
శూర్పణఖ పాత్ర పోషించడం తన జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రయాణం అని చెప్పారు రకుల్ ప్రీత్ సింగ్. భారతీయ సంస్కృతిలో భాగమైన రామాయణాన్ని ఇంత భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించడం అద్భుతమైన అనుభూతినిచ్చిందని చెప్పారు. ఇంత గొప్ప ఆలోచనను కార్యరూపంలో పెట్టిన దర్శకుడు నితీశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రాకు రకుల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచానికి భారత్ నుంచి ఓ అద్భుతమైన చిత్రాన్ని అందించాలన్న వారి తపన తనకు స్ఫూర్తినిచ్చిందని వివరించారు.ఈ సినిమాలో తన సహనటులైన రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్, రవిదూబే, కాజల్ అగర్వాల్‌తో పాటు, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమన్, చిత్ర యూనిట్ మొత్తానికి రకులో థ్యాంక్స్ చెప్పారు. రోజూ నాలుగు గంటల పాటు శ్రమించి తనను శూర్పణఖగా సిద్ధం చేసిన కాస్ట్యూమ్ బృందాల కృషిని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, ఒక భారతీయురాలిగా తాను ఎంతో గర్వపడే(Ramayana Review) క్షణం అని రకుల్ తన పోస్టులో ఉద్వేగంగా రాసుకొచ్చారు.
🙏🏻🙏🏻❤️
— Rakul Singh (@Rakulpreet) November 5, 2026
మహేష్ రివ్యూ
రామాయణ సినిమాను చూసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి మనం వింటూ పెరిగిన కథలు వెండితెరపై ఇంత అద్భుతంగా ప్రాణం పోసుకోవడం.. చూడటం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు మహేష్. రణ్‌బీర్ కపూర్, యశ్, సాయిపల్లవిల అభినయం మ్యాజికల్. నమిత్ మల్హోత్రా, నితీశ్ తివారీ.. మీకు హ్యాట్సాఫ్. ఇంత భారీ స్కేల్‌లో సినిమాను రూపొందించడంలో మీ శ్రమ ప్రశంసనీయం. ‘రామాయణ'(Ramayana Review) మొత్తం చిత్ర బృందానికి అభినందనలు” అని మహేశ్ బాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
The stories we’ve grown up hearing since childhood, coming alive so beautifully on the big screen… makes me so happy. ❤️
Ranbir, Yash, Sai Pallavi… magical. ❤️❤️❤️
@malhotra_namit & @niteshtiwari22 take a bow. Kudos to all your efforts in pulling off a film of this scale. Congrats to the entire team of #Ramayana !❤️❤️— Mahesh Babu (@urstrulyMahesh) November 6, 2026
వంగా మాట
రామాయణ సినిమాపై డైరెక్టర్ సందీప్ వంగా రివ్యూ ఇచ్చారు. ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రాముడు, రావణుడి పాత్రల అసలైన వైభవాన్ని, వారి శక్తిని తెలుసుకోవాలంటే కచ్చితంగా ‘రామాయణ’(Ramayana Review) సినిమా చూడాలన్నారు. రణ్‌బీర్, యశ్ ఇద్దరూ అద్భుతంగా నటించారని కితాబిచ్చాడు. వారి పాత్రలకు ప్రాణం పోశారని ప్రశంసించారు. తనకు ‘రామాయణ’ చాలా బాగా నచ్చిందన్నారు. ఇలాంటి అంకితభావంతో పనిచేసే నిర్మాతను తానేనెప్పుడూ చూడలేదంటూ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రను సందీప్ పొగిడారు.
Want to experience the MAGNITUDE of RAM & RAAVANA ?
PLEASE go watch R A M A Y A N A.
RANBIR & YASH — both nailed it bone-deep. 👌 Made their presence absolutely commanding 👏
I LOVED IT. ❤️
I have never known a producer to be this committed 🙏 @malhotra_namit— Sandeep Reddy Vanga (@imvangasandeep) November 5, 2026



