రామాయణపై స్టార్ డైరెక్టర్ల రివ్యూ
దేశ వ్యాప్తంగా రామాయణ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయి.. మంచి టాక్‌తో దూసుకుపోతోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈభారీ చిత్రం ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. విజువల్ వండర్ అంటూ సినీ ప్రియులు కితాబిస్తున్నారు. ఈ సినిమా చూసిన స్టార్ డైరెక్టర్లు సైతం ప్రసంశలు కురిస్తున్నారు.

Ramayana Movie on Directors Review
దేశ వ్యాప్తంగా రామాయణ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయి.. మంచి టాక్‌తో దూసుకుపోతోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈభారీ చిత్రం ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. విజువల్ వండర్ అంటూ సినీ ప్రియులు కితాబిస్తున్నారు. ఇదే క్రమంలో రామాయణ సినిమా చూసిన స్టార్ డైరెక్టర్లు(Ramayana Movie on Directors Review) సైతం ప్రసంశలు కురిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘రామాయణ’ సినిమాలో ఎన్నో అద్భుత ఘట్టాలు ఉన్నప్పటికీ, రావణుడి పాత్ర అద్భుతంగా ఉందని .. ‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలతో పాన్-ఇండియా సూపర్‌స్టార్‌గా ఎదిగిన యశ్, రావణుడి పాత్రలో తన స్క్రీన్ ప్రెజెన్స్, నటనలోని లోతుతో మరోసారి తన సత్తా చాటడని ప్రశంసిస్తున్నారు. తెరపై కనిపించిన మొదటి క్షణం నుంచే యశ్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసినట్లు తెలుస్తోంది.
జక్కన్న రివ్యూ
బాహుబలి, RRR తో విజువల్ వండర్ క్రియేట్ చేసిన టాలీవుడ్ డైరెక్టర్, జక్కన్న రామాయణ సినిపై తన రివ్యూ రాసుకొచ్చారు. అద్భుతమైన సినిమా అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. రామాయణ… సినిమా భారీ స్థాయి, వెండితెరపై అద్భుతమైన విజువల్స్ కనువిందు చేశాయన్నారు. రాముడిగా రణబీర్ ప్రశాంతతతో కూడిన గంభీరమైన అభినయంతో ఆకట్టుకున్నారని ఎక్స్‌లో పోస్ట్(Ramayana Movie on Directors Review) పెట్టారు. రావణుడిగా యశ్ భయంకరమైన ఉనికిని చూపించగా, సీతగా సాయి పల్లవి ఎంతో హుందాగా కనిపించారని చెప్పారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చిన నమిత్ మల్హోత్రా, నితీష్ తివారీతో పాటు చిత్ర బృందం మొత్తానికి హృదయపూర్వక అభినందనలు చెప్పారు రాజమౌళి.
#Ramayana… the sheer scale of the film and the visuals on the big screen are spectacular to watch.
Ranbir as Rama, especially from the Vanavasam onwards, is serene yet magnificent. Yash brings a menacing presence as Ravana, while Sai Pallavi is graceful as Sita. The pre-climax and climax… loved every bit of it.
Congratulations @malhotra_namit, @niteshtiwari22 and the entire team on bringing such an ambitious vision so beautifully to the screen. 🙏
— rajamouli ss (@ssrajamouli) November 5, 2026
అట్లీ మాట
‘రామాయణ’పై ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమ సత్తాను ప్రపంచ వేదికపై చాటిచెప్పేలా ఉందని కొనియాడాడు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదని.. అద్భుతమైన అనుభూతి అని అభివర్ణించాడు. ఎక్స్ (Ramayana Movie on Directors Review)వేదికగా అట్లీ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. అద్భుతమైన ఆలోచన, తెరకెక్కించిన తీరు, గొప్ప సినిమాటిక్ అనుభూతి.. ఇవన్నీ ‘రామాయణ’లో ఉన్నాయని పేర్కొన్నాడు. భారతీయ సంస్కృతి, భావోద్వేగాలకు ఎంతో దగ్గరగా ఉందని అన్నాడు. తరతరాలుగా ప్రేక్షకులు గుర్తుంచుకునే చిత్రంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డాడు. తన పిల్లలతో కలిసి ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నానని, కుటుంబంతో ఆస్వాదించాలని ఉందని తెలిపాడు. సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నాడు. అద్భుతమైన విజువల్స్ అందించిన డీఎన్‌ఈజీ సంస్థతో పాటు సాంకేతిక బృందాన్ని అభినందించాడు. నిర్మాత నమిత్ మల్హోత్రా దూరదృష్టిని, దర్శకుడు నితేశ్ తివారీ కృషిని అట్లీ ప్రత్యేకంగా ప్రశంసించాడు. వారి కష్టం, అంకితభావం భారతీయ సినిమాకు గర్వకారణమని అన్నాడు. కథను అందంగా మలిచిన స్క్రీన్‌ప్లే రచయిత శ్రీధర్ రాఘవన్‌కు కూడా అభినందనలు తెలిపాడు. భారతీయ కథలు, సంస్కృతి, భావోద్వేగాలను ప్రపంచ ప్రేక్షకులకు గొప్ప స్థాయిలో అందించగల సత్తా మన సినిమాకు ఉందని అట్లీ(Ramayana Movie on Directors Review) పేర్కొన్నాడు. ‘రామాయణ’ను ప్రపంచం మొత్తం ఆదరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. సినిమా తన మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెబుతూ.. రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు.
@TheNameIsYash bro #RanbirKapoor bro
@niteshtiwari22 @malhotra_namit @arrahman sir @Sai_Pallavi92 @MsKajalAggarwal @Rakulpreet @shobana_actor
@dneg #shridharragavan sir @arrameen
Entire team cast and crew congratulations https://t.co/cZMu429QsL— atlee (@Atlee_dir) November 5, 2026



