క్లీన్ యూ సర్టిఫికేట్.. రామాయణపై భారీ అంచనాలు
Ramayana Movie Certificate: రామాయణ సినిమాకు సంబంధించిన సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు విడుదల చేసింది. యూ సర్టిఫికెట్ జారీ చేయడంతో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ చూడొచ్చని సినిమా వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Ramayana Movie Certificate: దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు అందరూ నవంబర్ 5 కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. దీపావళి కానుకగా రిలీజ్ అయ్యే రామాయణ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో ఈసినిమా భారీగా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషో సినిమాకు సంబంధించి కీలక సమాచారం వెల్లడించింది. ఈసినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేసింది. యూ సర్టిఫికేట్ ప్రకారం అన్ని రకాల ప్రజలు.. చిన్నా పెద్ద అని తేడా లేకుండా ఈచిత్రాన్ని చూడొచ్చు. బుక్ మై షో వెల్లడించిన సమాచారం మేరకు రామాయణ సినిమా 3గంటల 15నిమిషాల నిడివి ఉండనుంది. అయితే ఈ సినిమాకు ఇంకా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అధికారిక వైబ్ సైట్‌లో ఇంకా నమోదు కాలేదు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బుక్ మై షో ఉన్న వివరాలే దాదాపు ఖరారు కానున్నాయి.
ఈసినిమాను నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తుండగా.. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మెర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెండితెరపై రామాయణ ఇతిహాస గాథను ఆవిష్కరిస్తున్నారు. ఇతిహాస గాథ కనుక ఇంత భారీ రన్ టైమ్ అవసరమేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ బడ్జెట్ వస్తున్న సినిమాలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసినిమాలో యశ్ రావణాశురుడి పాత్ర పోషిస్తుండగా.. రణబీర్ కపూర్ రాముడిగా .. సాయిపల్లవి సీత పాత్రలో యాక్ట్ చేస్తున్నారు.



