దీపావళి ట్వీట్… ఖర్గే వర్సెస్ బీజేపీ
Kharge vs BJP: AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దీపావలి సందర్భంగా చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సంతోషాల ఈద్ అంటూ కామెంట్ చేయడంపై బీజేపీ నేతుల మండిపడుతున్నారు. యూపీ ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే మల్లికార్జునఖర్గే అలా చేశారంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Kharge vs BJP: దీపావళి పండుగ వేళ దేశ రాజకీయాల్లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, దీపావళిని సంతోషాలకు ప్రతీకగా అభివర్ణిస్తూ సంతోషాల ఈద్ అంటూ పేర్కొన్నారు. ఈ పండుగ ప్రజల మధ్య ఆనందం, శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంపొందిస్తుందని ఆయన అన్నారు. వివిధ మతాలకు చెందిన పండుగలు ప్రజలను ఐక్యం చేయాలని, పరస్పర విభేదాలను పక్కనపెట్టి అందరూ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. అయితే ఖర్గే ఉపయోగించిన సంతోషాల ఈద్ అనే పదప్రయోగం రాజకీయ వివాదానికి కారణమైంది. ముఖ్యంగా హిందువుల పవిత్రమైన దీపావళిని మరో మతానికి చెందిన పండుగతో పోల్చడం ఏమిటంటూ బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలు, మతపరమైన భావోద్వేగాలను గాయపరిచేలా కాంగ్రెస్ అధ్యక్షుడి వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హిందూ సంప్రదాయాలు, సనాతన ధర్మం పట్ల గౌరవం చూపడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ను యాంటీ సనాతన, యాంటీ హిందూ పార్టీగా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రతినిధి సీఆర్ కేశవన్ సైతం కాంగ్రెస్ వైఖరిని తప్పుబడుతూ, రామ మందిర ప్రాణప్రతిష్ఠ, మహా కుంభమేళా, ఛత్ పూజ వంటి సందర్భాల్లో కాంగ్రెస్ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. హిందూ సంప్రదాయాలకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించారు.
యూపీ ఎన్నికల కోసమే ఖర్గే వ్యాఖ్యలు: బీజేపీ
2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. పండుగలు, మతపరమైన విశ్వాసాలను కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరికాదని విమర్శిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం తమ సందేశం వెనుక ఉద్దేశం మత సామరస్యం, జాతీయ ఐక్యతేనని స్పష్టం చేస్తోంది. పండుగల సమయంలో ప్రజలంతా పరస్పర విభేదాలను మరిచి సంతోషంగా ఉండాలని, దేశంలో శాంతిభద్రతలు, సోదరభావం కాపాడాలని ఖర్గే పిలుపునిచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తోంది.
Congress President Kharge’s twisted Diwali message underlines the blunt fact that the Congress party never hesitates to hurt and humiliate the faith and sentiments of crores of Hindu devotees just to peddle its toxic vote bank politics of appeasement. It was the same Kharge ji who had offensively demeaned the Maha Kumbh and our nation will never forget nor forgive how Rahul Gandhi crudely insulted the Chhath Puja, crudely labelling it as a drama. From Nehru’s Congress, which opposed the reconstruction of the glorious Somnath temple, to Rahul Gandhi’s Congress, which maliciously maligned the Pran Pratishtha ceremony of Bhavya Ram Mandir as a Naach Gaana event, the Congress party continues to harbour a very bitter Hindu Virodhi mindset, pandering to its divisive vote bank politics of appeasement.
— C.R.Kesavan (@crkesavan) November 9, 2026
కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ దుమారం
దీపావళి శుభాకాంక్షల సందర్భంగా ఖర్గే చేసిన ఒక్క పదప్రయోగం కాంగ్రెస్, బీజేపీ మధ్య మరో రాజకీయ వాగ్వాదానికి తెరతీసింది. పండుగల అసలు సందేశం ఐక్యత, సంతోషం, సోదరభావమే అయినప్పటికీ, రాజకీయ పార్టీల పరస్పర విమర్శలతో ఈ అంశం ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది. దీపావళిని సంతోషాల ఈద్‌గా అభివర్ణించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ బీజేపీ నేతల మండిపాటు.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పండుగలను వివాదాల్లోకి లాగుతున్నారంటూ విమర్శలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి..



