Kareena Kapoor Royal Jewellery

అందం, అభినయంతో బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ మరోసారి వార్తల్లోకెక్కారు. దీపావళి వేడుకల్లో తన రాయల్ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీపావళి వేడుకల్లో ఆమె ధరించిన దుస్తుల కంటే, మెడలోని లాకెట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 30 క్యారెట్ల అరుదైన పచ్చ రాయి దీపావళి వేడుకల్లో ఆమె వేసుకున్నారు. కరీనా(Kareena Kapoor Royal Jewellery) పునీత్ బలానా రూపొందించిన వెండి పనితనంతో కూడిన లేత గోధుమరంగు కఫ్తాన్, మ్యాచింగ్ తలపాగాతో రాజసం ఉట్టిపడేలా పచ్చరాయి కనిపించింది. కళ్లకు కాటుక, స్మోకీ మేకప్‌తో తన లుక్‌ను అదరగొట్టారు.

పచ్చ రాయి ప్రత్యేకత..!
కరీనా కపూర్ దీపావళి ఆభరణాల వెనుక కథలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె ధరించిన 30 క్యారెట్ల పచ్చ రాయి లాకెట్‌తో పాటు, తలపాగాపై అలంకరించిన 200 ఏళ్ల వజ్రాల కల్టిన చరిత్ర కూడా విశేషమైనది. కరీనా కపూర్ వేసుకున్న పచ్చరాయి లాకెట్‌ గురించి ప్రముఖ స్టైలిస్ట్ రియా కపూర్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ విలువైన పచ్చ రాయి లాకెట్ గతంలో భోపాల్ బేగంకు చెందినదిగా చెప్పారు. ఇందులో పవిత్ర ఖురాన్‌లోని సూరా అల్ బఖరాలో 255వ వచనమైన ఆయతుల్ కుర్సీని చెక్కించారు. సైఫ్ అలీ ఖాన్‌తో వివాహం తర్వాత ఈ వారసత్వ ఆభరణం కరీనాకు(Kareena Kapoor Royal Jewellery) చేరింది. ఇదే వేడుకలో ఆమె ధరించిన తలపాగాకు 200 ఏళ్ల చరిత్ర ఉన్న కల్గీని కూడా అలంకరించారు. ఇది భోపాల్ నవాబుల కుటుంబానికి చెందిన వారసత్వ ఆభరణం. సైఫ్ వివాహ సమయంలో కూడా దీనిని ధరించారు. మొత్తానికి, ఫ్యాషన్‌తో పాటు భోపాల్ రాజకుటుంబ వారసత్వాన్ని ప్రతిబింబించిన కరీనా దీపావళి లుక్‌లో 30 క్యారెట్ల పచ్చ రాయి లాకెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మూడు ఈకల ఆకారం
ఈలాకెట్‌ను మూడు ఈకల ఆకారంలో వజ్రాలతో రూపొందించారు. నాలుగు వరుసల ముత్యాలు ఈ ఆభరణానికి మరింత అందాన్ని ఇచ్చాయి. చరిత్రలోకి వెళ్తే.. హమీదుల్లా ఖాన్ భోపాల్ సంస్థానానికి చివరి పాలక నవాబ్. ఆయన కుమార్తె సజీదా సుల్తాన్. సజీదా సుల్తాన్‌ను పటౌడీ నవాబ్ ఇఫ్తికార్ అలీ ఖాన్ వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడే ప్రముఖ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ. మన్సూర్ అలీ ఖాన్, నటి షర్మిలా ఠాగూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడే సైఫ్ అలీ ఖాన్. అలా భోపాల్ రాజకుటుంబానికి చెందిన వారసత్వ ఆభరణాలు తరతరాలుగా సైఫ్ కుటుంబానికి చేరాయి.
ఈదీపావళి వేల కరీనా(Kareena Kapoor Royal Jewellery) ధరించింది కేవలం ఖరీదైన ఆభరణాలే కాదు.. తన భర్త సైఫ్ కుటుంబానికి చెందిన దాదాపు రెండు శతాబ్దాల రాజవంశపు చరిత్రను, వారసత్వాన్ని దీపావళి వేడుకల్లో మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది.