లాకెట్ తెచ్చిన తంటాలు.. వివాదంలో కరీనా
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ దీపావళి వేడుకలు గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఈవేడుకల్లో 30 క్యారెట్ల పచ్చల పురాతన లాకెట్ ను ధరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు అదే తీవ్ర దుమారానికి దారితీసింది.

Kareena Kapoor Pendant Controversy
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ దీపావళి వేడుకలు గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఈవేడుకల్లో 30 క్యారెట్ల పచ్చల పురాతన లాకెట్ ను ధరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు అదే తీవ్ర దుమారానికి దారితీసింది. ఆ లాకెట్‌లో పవిత్ర ఖురాన్‌లోని ‘ఆయత్-ఉల్-కుర్సీ’ వాక్యాలు చెక్కబడినాయంటూ కొందరు అభ్యంతరం చెప్పారు. దీనిపై ఆమెకు లీగల్ నోటీసులు(Kareena Kapoor Pendant Controversy) సైతం పంపారు.
కాంగ్రెస్ నేత నోటీసులు
కరీనా కపూర్‌కు సంబంధించిన దీపావళి వేడుకల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ తీవ్రంగా స్పందించారు. ఇస్లామిక్ సంస్కృతికి చెందిన అత్యంత పవిత్రమైన చారిత్రక ఆభరణాన్ని ఫ్యాషన్ వేదికలపై ప్రదర్శించడాన్ని తప్పుబట్టారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహారించారని(Kareena Kapoor Pendant Controversy) విమర్శించారు. అంతేకాదు తన న్యాయవాది మహమ్మద్ జాఫర్ ద్వారా నవంబర్ 11న కరీనా కపూర్, ఆమె ఫ్యాషన్ డిజైనర్ రియా కపూర్‌లకు లీగల్ నోటీసు పంపించారు. సోషల్ మీడియాలో లాకెట్‌కు సంబంధించి పోస్ట్ చేసిన ఫోటోలను వెంటనే డిలీట్ చేయాలని హెచ్చరించారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని తెలిపారు.
#WATCH | Bhopal, Madhya Pradesh: Chief Spokesperson – Madhya Pradesh Congress, Abbas Hafeez, has sent a legal notice to actor Kareena Kapoor over her social media post featuring a pendant bearing Quranic verses.
He says, “There is a pendant from the princely state of Bhopal, linked to the heritage of the Begums of Bhopal, which bears a verse from the Quran. For the Begums, this was a matter of faith, not a fashion accessory. It was customary for them to wear it while in seclusion… The way Kareena Kapoor has worn it, flaunting it as a fashion statement and posting pictures, is inappropriate, especially given the specific rituals associated with touching or reading verses from the Quran. In this sense, the post is objectionable. She should remove those pictures and offer an apology. That is the primary demand in the legal notice I have sent… The Congress party has no stance on this. This is a personal matter of mine. It should not be linked to my party, my ideology, or my political position.” (11.11)
— ANI (@ANI) November 11, 2026
హిందూ సంస్థ సపోర్ట్
కరీనా కపూర్‌కి కాంగ్రెస్ నేత నోటీసులు పంపిన వ్యవహారంలో హిందూ సంస్థ కలుగజేసుకుంది. కరీనాకు హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ మద్దతుగా నిలిచారు. లాకెట్ అనేది మెడలో, హృదయానికి దగ్గరగా ఎంతో పవిత్రమైన స్థానంలో ధరించేదన్నారు. అందులో అగౌరవ పరిచేలా ఏమీ లేదని ఆయన అన్నారు. కరీనా కపూర్ ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని(Kareena Kapoor Pendant Controversy) తేల్చిచెప్పారు. భోపాల్ రాజకుటుంబానికి కోడలిగా వచ్చిన కరీనాకు ఆ వారసత్వ ఆభరణాలను ధరించే హక్కు ఉందన్నారు. ఆమెకు సంస్కృతి బచావో మంచ్, హిందూ ఉత్సవ సమితి అండగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
Bhopal, Madhya Pradesh: On the pendant controversy involving actress Kareena Kapoor, Chandrashekhar Tiwari, President of the Hindu Utsav Samiti, says, “I think Kareena Kapoor is wearing the pendant around her neck, close to her heart. You can see the pendant clearly. On one side, the word ‘Maa’ is written, and on the other side, there is an image of the Goddess…”
— IANS (@ians_india) November 12, 2026
నో కామెంట్
దీపావళి వేడుకల కోసం కరీనా కపూర్ డిజైనర్ పునీత్ బలానా ప్రత్యేకంగా కాఫ్తాన్, తలపా తయారుచేశారు. లుక్ కోసం భోపాల్ బేగంకు చెందిన 30 క్యారెట్ల పచ్చల లాకెట్‌తో పాటు దాదాపు 200 ఏళ్ల నాటి కల్గీని కరీనా ధరించారు. అదే ఇప్పుడు(Kareena Kapoor Pendant Controversy) వివాదస్పదమైంది. అయితే ఈ వివాదంపై అటు కరీనా కపూర్ ఫ్యామిలీ స్పందించలేదు. ఒకవేళ స్పందిస్తే ఎలాంటి కౌంటర్ ఇస్తుందనేది ఆసక్తి రేపుతోంది. అయితే ఈవివాదం ఇంతటితో ముగుస్తుందా? లేక గాలివానలా మారుతుందా అనేది ఉత్కంఠ రేపుతోంది.



