కాంగ్రెస్ సీఎంలను స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నారా!
కర్నాటక సీఎం డీకే శివకుమార్ చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు దేశంలో కొత్త చర్చకు దారితీశాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ సీఎంలకు రక్షణ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీఎంలను టార్గెట్‌గా చేస్తున్నారని.. స్టింగ్ ఆపరేషన్లు మొదలుపెట్టారని ఆరోపించారు.

DK Shivakumar: కర్నాటక సీఎం డీకే శివకుమార్ చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు దేశంలో కొత్త చర్చకు దారితీశాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ సీఎంలకు రక్షణ లేదన్నారు. బీజేపీ, ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రులకు కాకుండా కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీఎంలను టార్గెట్‌గా చేస్తున్నారని.. స్టింగ్ ఆపరేషన్లు మొదలుపెట్టారని ఆరోపించారు. కేరళ సీఎం వీడి సతీశన్‌తో పాటు తనను లక్ష్యంగా చేసుకుని స్టింగ్ ఆపరేషన్‌కు ప్రయత్నించారని ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం డీకే చెప్పారు. స్టింగ్ ఆపరేషన్ ఎలా చేసారో… ఏసందర్భంలో జరిగిందో పూసగుచ్చినట్లు వివరించారు ముఖ్యమంత్రి డీకే.
మెటా స్మార్ట్ గ్లాసెస్‌తో స్టింగ్ ఆపరేషన్!(DK Shivakumar)
ఓ వ్యాపారవేత్త అధికారుల ద్వారా తనను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకుని బిజినెస్ గురించి మాట్లాడేందుకు తన ఛాంబర్‌కి వచ్చారని తెలిపారు డీకే. తనతో మాట్లాడేందుకు వచ్చేటప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి వచ్చారని .. అది చూసిన వెంటనే తనకు అనుమానం వచ్చిందన్నారు. అయినా తనతో మాట్లాడనని చెప్పారు. ఆ వ్యక్తి ఫస్ట్ వ్యాపారాల గురించి డిస్కషన్ స్టార్ట్ చేసి.. క్రమంగా రాజకీయాలు, బూత్ స్థాయి వ్యూహాలు, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మాట్లాడం మొదలు పెట్టారని చెప్పారు. తనకు అతని మాటతీరుపై అనుమానం కలిగి విచారణ చేయాలని అధికారులను ఆదేశించానన్నారు. విచారణ తర్వాత అధికారుల నుంచి తెలుసున్న విషయాలను విని తాను విస్తుపోయానని చెప్పారు. ఆ బిజినెస్ మ్యాన్ తనకంటే ముందుకు కేరళ సీఎంను కలిశారని.. ఆయనను కలినప్పుడు కూడా అదే మెటా స్మార్ట్ గ్లాసెస్ పెట్టుకుని ఉన్నారని తెలిందన్నారు. అయితే సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫగ్నవీస్తో పాటు ఓ కేంద్రమంత్రిని కలిసినప్పుడు మాత్రం మెటా స్మార్ట్ గ్లాసెస్ పెట్టుకోలేదన్నారు. మెటా స్మార్ట్ గ్లాసెస్ ద్వారా అతను రహస్యంగా తనవి, వీడి సతీశన్ మాటలను చిత్రీకరించేందుకు యత్నించారని.. ఆవిషయం అధికారులు విచారణలో నిర్థారణ అయిందన్నారు.
మంత్రులు, అధికారులను హెచ్చరించా!
ఆ వ్యాపార వేత్త స్టింగ్ ఆపరేషన్ గురించి తెలిసిన వెంటనే తాను మంత్రి వర్గ సహచరులను అప్రమత్తం చేశారనన్నారు డీకే. అలా చేయడం కూడా తన బాధ్యత అని చెప్పారు డీకే. మంత్రులు, వ్యక్తిగత సహాయకులు, ఫోన్ కాల్స్ ద్వారా జరిగే ఉచ్చులో పడొద్దని నిరంతరం అలర్ట్‌గా ఉండాలని ఆదేశించనన్నారు. అయితే స్టింగ్ ఆపరేషన్‌కి పాల్పడిన వ్యక్తి వివరాలు ఇప్పుడు తాను వెల్లడించలేనని.. సమయం వచ్చినప్పుడు బయటపెడతానన్నారు. ఆ విషయాలు బయటకు చెప్పే టైం ఇది కాదన్నారు.
డీకే వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ
ఇదే సమయంలో కర్నాటకలో మాజీ సీఎం సిద్దరామయ్యకు చెందిన వీడియో వివాదం నడుస్తోంది. ఇదే టైంలో డీకే చేసిన స్టింగ్ ఆపరేషన్ వ్యాఖ్యలు చేయడం కర్నాటకలో దుమారం రేపుతోంది. మంత్రులను గుప్పెట్లో పెట్టుకునేందుకే డీకే ఇలా స్టింగ్ ఆపరేషన్ అంటూ భయాందోళనకు గురిచేస్తున్నారని కేంద్రమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి విమర్శించారు. గతంలో సిద్దరామయ్య ప్రభుత్వంలోని మంత్రులపై ఇదే ఆపరేషన్ చేసి డీకే శివకుమార్ ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారని ఆరోపించారు. 2011 నాటి వీడియోలను ఉపయోగించి సిద్దరామయ్యను పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. అయితే విపక్షాల ఆరోపణలను డీకే కొట్టిపారేశారు. కాంగ్రెస్‌లో చీలిక తెచ్చే కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మరోవైపు కాంగ్రెస్ కూడా విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చింది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కర్నాటకకు చెందిన బీజేపీ నేత ప్రైవేట్ ఏజెన్సీకి నిధులు సమకూర్చారని ఎమ్మెల్యే రవికుమార్ ఆరోపించారు. తనవి కేవలం ఆరోపణలే కాదని.. దానికి సంబంధించిన పక్కా ఆధారాలు.. పెన్ డ్రైవ్‌లో ఉన్నాయని చెప్పారు.



