కార్తీక్ సుబ్బరాజ్‌కి మెగా ఆఫర్!
చిరంజీవితో సినిమా ఓకే అయిందని స్వయంగా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజే ప్రకటించారు. మెగాస్టార్‌కి తానే స్వయంగా కథ వినిపించినట్లు సుబ్బరాజ్ తెలిపారు. ఇటీవల పర్మిట్ రూమ్ అనే పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న ఆయన ఈవిషయంపై క్లారిటీ ఇచ్చారు. సుమారు రెండు గంటలపాటు సినిమా కథపై చర్చలు జరిగాయని .. కథ వినిపించింది నిజమేనని అన్నారు

Chiranjeevi Karthik Subbaraj Movie
టైమ్.. టైమింగ్‌ను సెట్ చేయడంలో మెగాస్టార్ దిట్ట. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాతో దూసుకుపోతున్నారు. 1980 చిరంజీవిని తలపిస్తున్నారు. కుర్రాళ్లకు ధీటుగా సినిమాలు తీస్తూ తానేమి తక్కువకాదని నిరూపిస్తున్నారు. ఒకదాని తర్వాత వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ఇప్పటికే బాబీ డైరెక్షన్ కాకా సినిమా పూర్తి చేసిన చిరు.. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరను కూడా రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్.. నాని ప్రొడ్యూసర్‌గా సినిమాను త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. ఇప్పుడు తాజాాగా పేట సినిమా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు(Chiranjeevi Karthik Subbaraj Movie )తో సినిమా ఓకే అయినట్లు తెలుస్తోంది.
చిరంజీవితో సినిమా ఓకే అయిందని స్వయంగా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజే ప్రకటించారు. మెగాస్టార్‌కి తానే స్వయంగా కథ వినిపించినట్లు సుబ్బరాజ్ తెలిపారు. ఇటీవల పర్మిట్ రూమ్ అనే పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న ఆయన ఈవిషయంపై క్లారిటీ ఇచ్చారు. సుమారు రెండు గంటలపాటు సినిమా కథపై చర్చలు జరిగాయని .. కథ వినిపించింది నిజమేనని అన్నారు. కాని ఎప్పుడు తీస్తానన్నది డేట్స్ ఫిక్స్ అవలేదని చెప్పారు. టోటల్‌గా చిరు(Chiranjeevi Karthik Subbaraj Movie )తో కలిసి సినిమా చేయడం మాత్రం పక్కాని తెలిపారు. నేను స్టోరీ చెప్పాను సినిమాపై తుదినిర్ణయం చిరుదే అన్నారు. దీంతో కొన్ని రోజులుగా టాలీవుడ్, కోలివుడ్‌లో జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరింది.
కార్తీక్ సుబ్బరాజ్ పిజ్జా, జిగర్తాండ, వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ తోను పేట వంటి భారీ యాక్షన్ చిత్రాన్ని తీశారు. దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. కార్తీక్ సుబ్బరాజ్‌ది మేకింగ్ స్టైల్, కథల విషయంలో డిఫ్రంట్ స్ట్రైల్. చిరుతో సుబ్బరాజ్ అనే టాక్ బయటకు రాగానే అటు చిరు ఫ్రాన్స్ సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇలాంటి మంచి డైరెక్టర్‌తో చేయాలని .. విభిన్న కథతో అలంరించాలని ఆశిస్తున్నారు చిరు ఫ్యాన్స్. ఒకవేళ కార్తీక్ సుబ్బరాజ్(Chiranjeevi Karthik Subbaraj Movie )తో కాని ప్రాజెక్ట్ ఓకే అయితే అభిమానుల ఆశలు తీరతాయని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చిరుకాని ఓకే చెప్తే వీరిద్దరి కాంబినేషన్‌లో ట్రెండింగ్ సినిమా రావడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి చిరు ఎప్పడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో మరి.
మరోవైపు చిరంజీవి నటించిన కాకా సినిమా పూర్తయింది. ఇటీవలే డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. 2027 సంక్రాంతి కానుకగా ఈసినిమా విడుదల చేస్తున్నారు. గతంలోను వాల్తేరు వీరయ్య సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి వీరిద్దరి కాంబినేషన్‌లో హిట్ కొట్టారు. దీంతో ఇప్పడు రాబోయే కాకా సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.



