పవన్ కళ్యాణ్ విడాకులు.. మూడేళ్ల క్రితమే ఆయన చెప్పారా..?
Venu Swamy Prediction: పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకుంటారంటూ మూడేళ్ల క్రితం ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. సరిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవాతో విడాకులు తీసుకోవడం సంచలనంగా మారింది.

Venu Swamy Prediction: తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జ్యోతిష్యుడిగా గుర్తింపు పొందిన వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల జాతకాలను విశ్లేషిస్తూ తరచూ సంచలన వ్యాఖ్యలు చేసే ఆయన.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై గతంలో చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. పవన్ కళ్యాణ్ నాలుగో వివాహం గురించి వేణుస్వామి ముందుగానే జోస్యం చెప్పారంటూ ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్న నేపథ్యంలో వేణుస్వామి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. దీంతో వేణుస్వామి చాలా పవర్ ఫుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
2023లోనే పవన్ వివాహంపై జోస్యం..!
గతంలో సమంత, నాగచైతన్య విడిపోతారని వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. చివరకు అన్నట్లు నాగచైతన్య, సమంత ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అంతేకాకుండా సమంత ప్రముఖ దర్శకుడు రాజ్ నిడుమోరును వివాహం చేసుకోగా.. నాగచైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లను వివాహం చేసుకున్నారు. అదే విధంగా 2023లో పవన్ కళ్యాణ్ మూడో వివాహ బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగదంటూ ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ జీవితంలో మరో వివాహానికి అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈ వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
పవన్ జాతకంలో గురు గ్రహమే కారణమా?
వేణుస్వామి తన జ్యోతిష్య విశ్లేషణలో పవన్ కళ్యాణ్ జాతకంలోని గురు గ్రహ స్థితిని ప్రస్తావించినట్లు వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. ముఖ్యంగా గురువు నీచ స్థానంలో ఆరో ఇంట్లో ఉండటమే వైవాహిక జీవితంలో సమస్యలకు కారణమని ఆయన విశ్లేషించారు. ఈ గ్రహ స్థితుల ఆధారంగానే పవన్ జీవితంలో మరో వివాహం జరిగే అవకాశముందని గతంలో చెప్పినట్లు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకులకు సంబంధించిన ప్రకటన వెలువడిన నేపథ్యంలో వేణుస్వామి పాత వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. మూడేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు రావడంతో ఆయన జోస్యం నిజమైందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం జ్యోతిష్య అంచనాలను వాస్తవాలతో ముడిపెట్టడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
ఇన్‌స్టా అకౌంట్‌ను డిలీట్ చేసిన అన్నా లెజినోవా
పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకులు తీసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అన్నా లెజినోవా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏడాది క్రితమే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన అన్నా లెజినోవా.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఫోటోలతో పాటు, కుమారుడికి ప్రమాదం జరిగిన సమయంలో తిరుపతికి వెళ్లిన ఫోటోలను కూడా ఆమె తన అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం అన్నా లెజినోవా ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ఫాలో అయ్యారు. ఆమె షేర్ చేసిన ఫోటోలకు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు కూడా వచ్చాయి. దీంతో అన్నా లెజినోవా సోషల్ మీడియా అకౌంట్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఇప్పుడు విడాకుల వ్యవహారం తెరపైకి రావడానికి ముందే ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె అకౌంట్ కోసం సెర్చ్ చేస్తున్నప్పటికీ కనిపించడం లేదని నెటిజన్లు చెబుతున్నారు. దీంతో అన్నా లెజినోవా ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను తొలగించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.



