ఏపీలో విషాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రహదారి పనుల్లో పేలుడు జరిగి ఐదుగురు మృతి చెందారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం పినకోట గ్రామంలో రహదారి పనుల కోసం కాంట్రాక్టర్ బ్లాస్టింగ్ పనులు నిర్వహించారు. అయితే, అదే సమయంలో అటుగా వస్తున్న టిప్పర్ డ్రైవర్‌కు బ్లాస్టింగ్ విషయం తెలియలేదు. దీంతో లారీ సమీపంలో పేలుడు సంభవించడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమంది గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
రహదారి పనుల కోసం బ్లాస్టింగ్
రహదారి పనుల్లో భాగంగా కొండను తొలిచేందుకు బ్లాస్టింగ్ పనులు చేపట్టినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అయితే, ఆ పనులను గమనించకపోవడంతోనే టిప్పర్ డ్రైవర్‌తో పాటు నలుగురు కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ముందస్తుగా ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని పేర్కొంటూ, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు వేసేటప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.



