Surekha Vani Viral Video: టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన నటన, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పుడు సురేఖ వాణికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

2019లో మరణించిన సురేఖ వాణి భర్త

ఇక సురేఖ వాణి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆమె భర్త సురేష్ తేజ కూడా సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన వ్యక్తే. పలు సీరియళ్లకు ఆయన దర్శకత్వం వహించారు. సురేఖ వాణి, సురేష్ తేజ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి సుప్రియ అనే కుమార్తె ఉంది. అయితే 2019లో అనారోగ్య కారణాలతో సురేష్ తేజ కన్నుమూశారు. అప్పటి నుంచి సురేఖ వాణి తన కుమార్తెతో కలిసి జీవిస్తున్నారు. ఆ తర్వాత నుంచి తన కుమార్తె సుప్రియతో కలిసి సురేఖ వాణి చేసే సందడి సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇద్దరూ కలిసి గోవా వంటి ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్తూ అక్కడి ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇంట్లోనే ప్రత్యేకంగా వీడియోలు రూపొందిస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కొనసాగుతోంది.

యువకుడితో సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్

ఇదిలా ఉంటే తాజాగా సురేఖ వాణికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఓ యువకుడితో ఆమె సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ట్రోల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏజ్ గ్యాప్ ఉన్న యువకుడితో సురేఖ వాణి రోమాన్స్ చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. మరికొంతమంది అయితే వీడియోలు ఉన్న వ్యక్తి స్నేహితుడు, లేకపోతే బంధువుల వ్యక్తి అయి ఉండొచ్చని మరికొంతమంది అభిప్రాయం చెబుతున్నారు. ఇలా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోను సురేఖ వాణి ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసినట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు ఆ వీడియోను ఎందుకు పోస్ట్ చేశారు? ఆ తర్వాత ఎందుకు తొలగించారు? అనే అంశాలపై నెట్టింట చర్చ సాగుతోంది.

జిమ్‌లో అదరగొట్టిన సురేఖ వాణి

తన కుమార్తె సుప్రీతకు సినీ అవకాశాలు తీసుకురావడానికి సురేఖ వాణి చేసిన ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ఫలించకపోవడంతో ఇప్పుడు ఆమె తన కెరీర్‌పై మరోసారి దృష్టి సారించినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కుమార్తె కెరీర్‌తో పాటు తన సినీ ప్రయాణాన్ని కూడా తిరిగి గాడిలో పెట్టుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అందులో భాగంగా తాజాగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో ఇటీవల తన అభిమానులతో పంచుకున్నారు. సురేఖ వాణి షేర్ చేసిన ఈ వీడియోలో ఆమె ఎంతో ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా వివిధ రకాల వ్యాయామాలు చేస్తూ కనిపించారు. ఆమె ఫిట్‌నెస్ చూస్తుంటే ఇప్పటికీ హీరోయిన్‌లాగే ఉన్నారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ఇన్‌స్టా వేదికగా వీడియోని పోస్ట్ చేసి డిలీట్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.