PrabhasThe Raja Saab Sequel: ది రాజాసాబ్ ఫ్లాప్‌పై స్టార్ ప్రొడ్యుస‌ర్ టీజీ విశ్వ‌ప్ర‌సాద్ వివ‌ర‌ణ ఇచ్చారు. సంక్రాంతి టైంలో కాకుండా వేరే స‌మ‌యంలో రాజాసాబ్ విడుద‌ల చేసి ఉంటే బాగుండేద‌ని.. ప్రేక్ష‌కులు ఆద‌రించే వార‌ని అన్నారు. క‌లెక్ష‌న్స్ కూడా బాగా వ‌చ్చేవ‌ని.. డిస్టిబ్యూట‌ర్లకు మేలు జ‌రిగేద‌న్నారు. తాజాగా టీజీ విశ్వ‌ప్రసాద్ బ్యాన‌ర్‌ పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నుంచి గ‌రివిడి ల‌క్ష్మి సినిమా రూపుదిద్దుకుంది. బుర్ర‌క‌థ నేప‌థ్యంలో ఉత్త‌రాంధ్ర స్టైల్‌లో ఈసినిమా నిర్మించారు. ఈసినిమా ఈనెల 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఇప్ప‌టికే ఈసినిమా నుంచి వ‌చ్చిన ట్రైల‌ర్, పాట‌లు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. అంతేకాదు సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. ఏకంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌నయుడు, విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గ‌రివిడి ల‌క్ష్మి సినిమాపై ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఈసినిమా చేసేందుకు ఆస‌క్తిగా ఉన్నాన‌ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన ఓజీ సినిమా త‌ర్వాత మ‌రోసారి గ‌రివిడి ల‌క్ష్మి సినిమా విష‌యంలో నారా లోకేష్ స్పందించారు.

గ‌రివిడి ల‌క్ష్మి సినిమా ప్ర‌మోష‌న్‌ల‌లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో నిర్మాత టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఆస‌క్తిక‌ర విష‌యాలు మాట్లాడారు. ద‌స‌రాకు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నా.. తాము మంచి ప్ర‌యోగాత్మ‌క సినిమాతో వ‌స్తున్నామ‌ని తెలిపారు. గ‌రివిడి ల‌క్ష్మి ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. అంతేకాదు ఎక్కువ రోజులు థియేట‌ర్ల‌లో ఆడుతుంద‌న్నారు. ఇదే క్ర‌మంలో రాజా సాబ్ సినిమా గురించి కూడా అనేక విష‌యాలు ప్ర‌స్తావించారు నిర్మాత విశ్వ‌ప్ర‌సాద్. సినిమాకున్న భారీ అంచనాల‌ను దృష్టిలో పెట్టుకుని మావ‌ర‌కు బాగానే విడుద‌ల చేశామ‌ని చెప్పారు. సినిమా రేట్లు పెంచేందుకు య‌త్నించడంతో ప్రీమియ‌ర్లు ఆల‌స్యం అయ్యాయ‌న్నారు. సంక్రాంతి రావ‌డం అనేది రాంగ్ డిసిష‌న్ అన్నారు. సినిమా ఆడ‌క‌పోవ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని చెప్పారు. ఇదే క్ర‌మంలో ది రాజాసాబ్ సీక్వెల్ ఉంటుందని ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ మారుతి ప్ర‌క‌టించారు.. దీనిపై మీ స్పంద‌న ఏంట‌ని మీడియా వాళ్లు నిర్మాత విశ్వ‌ప్ర‌సాద్‌ను ప్ర‌శ్నించారు. సీక్వెల్ మా సంస్థ నుంచి చాలా వ‌స్తాయ‌న్నారు. మిరాయ్‌, జాంబీరెడ్డితో పాటు ప‌లు సినిమాల సీక్వెల్స్ ఉంటాయ‌న్నారు. ఏది చేసిన భ‌విష్య‌త్తులో తప్పులు జ‌ర‌గ‌కుండా చూసుకుంటామ‌న్నారు.

అంతేకాదు 2028లో ప్ర‌భాస్‌తో భారీ చిత్రం తీస్తున్న‌ట్లు చెప్పారు విశ్వ‌ప్ర‌సాద్. స్పిరిట్ సినిమా విష‌యంలో తాను కేవ‌లం డిస్ట్రిబ్యూట‌ర్‌ని మాత్ర‌మేన‌న్నారు. ప్ర‌స్తుతం 10సినిమాలు త‌మ‌ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లో ఉన్నట్లు తెలిపారు. ఏదీఏమైనా భ‌విష్య‌త్తులో సీక్వెల్సే కాదు ఏసినిమా తీసిన జాగ్ర‌త్తప‌డాత‌న‌ని నిర్మాత విశ్వ‌ప్ర‌సాద్ చెప్పారు.