ఆగిపోయిన విశ్వంభర.. రిలీజ్ చేయొద్దన్న చిరంజీవి..?
Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా ఆగిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏడాదిగా సినిమా ఆలస్యమవుతుండటంతో.. ఎప్పుడు విడుదల అవుతోందని ఫ్యాన్స్ నుంచి ప్రశ్నలు మొదలువుతున్నాయి.

Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా విశ్వంభర. భారీ బడ్జెట్.. సోషియో ఫాంటసీ కథ.. చిరంజీవి (Mega Star Chiranjeevi) లాంటి మెగాస్టార్.. దీనికి తోడు అద్భుతమైన విజువల్స్. ఇవన్నీ కలిపి విశ్వంభరపై (VISHWAMBHARA) మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు అదే సినిమా గురించి వినిపిస్తున్న వార్తలు మెగా ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. అసలు విశ్వంభర ఎప్పుడు వస్తుంది? అంతేకాదు.. సినిమా షూటింగ్ పూర్తయినా ఎందుకు విడుదల కావడం లేదు? ఒకప్పుడు చిరంజీవి స్వయంగా ఇచ్చిన రిలీజ్ హామీ ఏమైంది? ఇప్పుడు హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో సినిమాతో బిజీ అవుతుండటంతో విశ్వంభర పరిస్థితి ఏంటి? ఇదే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఏడాదిగా వాయిదా పడుతున్న చిరంజీవి సినిమా
విశ్వంభర (VISHWAMBHARA) ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా. కానీ, అనేక కారణాలతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ముందుగా సంక్రాంతి రిలీజ్ అనుకున్నారు. అది జరగలేదు. ఆ తర్వాత సమ్మర్లో అయినా సినిమా థియేటర్లలోకి వస్తుందని మెగా అభిమానులు ఆశించారు. కానీ, ఆ ఆశ కూడా నెరవేరలేదు. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది కోసం విశ్వంభర వెనక్కి వెళ్లిందనే వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి. ఇక వచ్చే సంక్రాంతికి వస్తుందా అంటే.. ఇప్పటికే బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమాకు ఆ స్లాట్‌పై ఫోకస్ ఉంది. అంటే, విశ్వంభరకు మళ్లీ రిలీజ్ డేట్ ప్రశ్నార్థకంగానే మారింది. సినిమా సెకండాఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌పై ఆధారపడి ఉంటుందని.. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేకర్స్ చాలా సమయం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, సినిమా ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వండి మహాప్రభూ అంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
మోక్షజ్ఞ సినిమాతో బిజీబిజీగా దర్శకుడు
బింబిసార సినిమా తీసిన వశిష్ఠ.. ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో (Mega Star Chiranjeevi) సినిమా చేసే ఛాన్స్ కొట్టేశారు. అయితే, సినిమా ఆలస్యమవుతుండటంతో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను వశిష్ఠ పరిచయం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం పూర్తయిందని.. సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యమని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాకు భారీ బడ్జెట్‌తో పాటు కొత్త హీరోయిన్ను పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తొలి సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టడంతో వశిష్ఠ ఫోకస్ ఆ ప్రాజెక్ట్‌పైకి వెళ్లింది.
వారణాసితో బిజీబిజీగా కీరవాణి
అదే సమయంలో సంగీత దర్శకుడు కీరవాణి కూడా విశ్వంభరను పక్కన పెట్టి వారణాసి (Varanasi) ప్రాజెక్ట్‌తో బిజీ అయ్యారని సమాచారం. విశ్వంభర రీరికార్డింగ్ పనులను మరో సంగీత దర్శకుడు హరి గౌర పర్యవేక్షిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక భారీ సినిమా విడుదలకు ముందే దాని హీరో మరో సినిమా షూటింగ్లో, దర్శకుడు మరో ప్రాజెక్ట్‌లో, సంగీత దర్శకుడు ఇంకో సినిమాతో బిజీగా ఉండటం అంటే.. విశ్వంభర (VISHWAMBHARA) పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎక్కువ కాలం ఎదురుచూసే కొద్దీ సినిమాపై అంచనాలు పెరుగుతాయి. అదే సమయంలో అభిమానుల సహనం కూడా పరీక్షకు గురవుతుంది. అసలు విశ్వంభర విషయంలో జరుగుతున్నది ఏంటి? దీనికి సమాధానం మాత్రం అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే తెలుస్తుంది. అప్పటివరకు మెగా ఫ్యాన్స్‌కి మిగిలింది ఒక్కటే.. విశ్వంభర ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూడటం..



