పోరాటాలతో లేదు.. ఓటుతోనే సాధ్యం: కల్వకుంట్ల కవిత
Kavita on Congress Party: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత కవిత తెలిపారు .77 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతామన్నారు. కలిసి వచ్చే పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

Kavita on Congress Party: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్ని పోరాటాలు చేసినా ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాలంటే ఎన్నికల్లో ఓటు ద్వారా సరైన తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భగా ప్రచారా రథాలను కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన కవిత.. రాష్ట్రవ్యాప్తంగా 77 నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ తరఫున అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థులకు వీర తిలకం దిద్ది యుద్ధరంగంలోకి పంపుతున్నామని పేర్కొన్నారు. ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
https://t.co/CRUoLqfaM7
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) November 11, 2026
టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల గుర్తింపు వచ్చింది: కవిత
టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి అధికారిక గుర్తింపు ఉందని కవిత తెలిపారు. పార్టీకి సంబంధించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ, వాటికి సంబంధించిన సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. త్వరలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల నమోదు అంశాన్ని కవిత ప్రస్తావించారు. తెలంగాణలో సుమారు నాలుగు కోట్ల మంది జనాభా ఉండగా, వారిలో దాదాపు 80 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారని వివరించారు. అయితే ఇంత పెద్ద సంఖ్యలో అర్హులైన గ్రాడ్యుయేట్లు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు 10 లక్షల మంది కూడా ఓటర్లుగా నమోదు చేసుకోకపోవడం ఆందోళనకరమన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రజలు తమ అభిప్రాయాన్ని బలంగా తెలియజేయవచ్చని పేర్కొన్నారు.
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) November 11, 2026
డబ్బుతో యువతను కొనుగోలు చేయలేరు: కవిత
ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరుగుతోందని ఆరోపించిన కవిత.. కాంగ్రెస్ పార్టీ రూ.200 కోట్లు ఖర్చు చేసి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తోందని విమర్శించారు. యువత డబ్బు ప్రలోభాలకు లొంగకుండా, తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దాని ద్వారానే రాజకీయ పార్టీలకు తగిన సమాధానం చెప్పవచ్చని అన్నారు. దేశవ్యాప్తంగా యువ ఎంపీల ప్రాతినిధ్యాన్ని ప్రస్తావిస్తూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎనిమిది మంది యువ ఎంపీలు ఉంటే, వారిలో రాజకీయ నేపథ్యం లేని వారు ఒక్కరే ఉన్నారని పేర్కొన్నారు. రాజకీయాల్లో సామాన్య యువతకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో మార్పు కోరుకునే ప్రజలు, ముఖ్యంగా యువత తమకు మద్దతుగా నిలవాలని కవిత విజ్ఞప్తి చేశారు. కేవలం రాజకీయ పార్టీల హామీలను నమ్మకుండా, తమ ఓటు ద్వారా భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.



